విజయసాయిరెడ్డి ఫ్యామిలీతో తారకరత్న దైవదర్శనం

విజయసాయిరెడ్డి తన భార్య తరఫు బంధువు అని, అందువల్లనే వారితో కలిసి దైవదర్శనానికి వచ్చానని ఆయన చెప్పారు. ఎన్నికల తర్వాత తమ మామయ్య, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నార చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతారని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు. ఎన్నికల తర్వాత బాబాయ్ బాలకృష్ణకు కీలక బాధ్యతలు అప్పగిస్తారని ఆయన అన్నారు. పార్టీ ఆదేశిస్తే వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేస్తానని ఆయన చెప్పారు.
మే 27, 28 తేదీల్లో జరిగిన తెలుగుదేశం పార్టీ మహానాడుకు కూడా తారకరత్న హాజరైన విషయం తెలిసిందే. ఈ సమయంలో ఆయన జూనియర్ ఎన్టీఆర్ ప్రకటనకు కౌంటర్ ఇచ్చాడు. మహానాడుకు తనకు ఆహ్వానం అందలేదని, అంది ఉంటే మహానాడుకు వెళ్లి ఉండేవాడినని, ఇప్పుడు పిలిచినా వెళ్తానని జూనియర్ ఎన్టీఆర్ మే 28వ తేదీన తాత ఎన్టీ రామారావుకు నివాళి అర్పించిన సందర్బంగా మీడియా ప్రతినిధులతో అన్నారు.
జూనియర్ ఎన్టీఆర్ ప్రకటనతో తారకరత్న విభేదించారు. మహానాడుకు రావడానికి ఆహ్వానం అవసరం లేదని. తాతా ఎన్టీ రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ తలుపులు నందమూరి కుటుంబ సభ్యులకు తెరిచే ఉంటాయని, పార్టీ కోసం పనిచేయడం నందమూరి కుటుంబ సభ్యుల బాధ్యత అని ఆయన అన్నారు. ఈ మాటలు రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.












Click it and Unblock the Notifications