వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డిఎల్ బర్తరఫ్‌ని తప్పుపట్టిన కెకె, ఆవేశమన్న పాల్వాయి

By Srinivas
|
Google Oneindia TeluguNews

K Keshava Rao
హైదరాబాద్: మంత్రి పదవి అనేది భిక్ష కాదని కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత కె కేశవ రావు ఆదివారం అన్నారు. మంత్రులను ఎప్పుడు పడితే అప్పుడు తొలగించడం సబబు కాదన్నారు. డిఎల్ రవీంద్రా రెడ్డిని బర్తరఫ్ చేయడాన్ని ఆయన తప్పు పట్టారు. డిఎల్ తొలగింపు సరైన విధానం కాదని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. కెకె, మంద జగన్నాథం, వివేక్‌లు ఈ రోజు సాయంత్రం తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరనున్నారు.

సిఎం ఇష్టం: బాలరాజు

కాంగ్రెసు పార్టీ అధిష్టానం మేరకే డిఎల్ రవీంద్రా రెడ్డిని తొలగించినట్లు మంత్రి బాలరాజు విశాఖపట్నంలో చెప్పారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన వారిపై ముఖ్యమంత్రి చర్యలు తీసుకోవచ్చునని చెప్పారు. మార్పులు, చేర్పులు సిఎం ఇష్టంపై ఆధారపడి ఉంటుందన్నారు. కేబినెట్ సర్వాధికారాలు ఆయనకే ఉంటాయన్నారు. డిఎల్ తొలగింపును సమర్థిస్తున్నట్లు ఆయన చెప్పారు.

ఆ స్థాయి కాదు: కొండ్రు

డిఎల్ రవీంద్రా రెడ్డి తొలగింపుపై మాట్లాడాల్సిన స్థాయి తనది కాదని మంత్రి కొండ్రు మురళీ మోహన్ వేరుగా అన్నారు. ముఖ్యమంత్రి తనకు అప్పగించిన బాధ్యతలను నెరవేర్చేడమే లక్ష్యమన్నారు. సిఎం ఏ బాధ్యతలు అప్పగించినా సమర్థవంతంగా నిర్వహిస్తానన్నారు. ఆయన మాజీ మంత్రి ధర్మాన ప్రసాద రావును మర్యాదపూర్వకంగా శ్రీకాకుళంలో కలిశారు.

బర్తరఫ్ విచారకరం: సారయ్య

డిఎల్ రవీంద్రా రెడ్డి తొలగింపు విచారకరమని బిసి సంక్షేమ శాఖ మంత్రి బస్వరాజు సారయ్య వరంగల్‌లో అన్నారు. డిఎల్ బర్తరఫ్ వార్తలు తాను మీడియాలో చూశాని, దీనిపై మంత్రివర్గ సమావేశంలో చర్చిస్తామని చెప్పారు.

షోకాజ్ నోటీసు ఇవ్వకుండానా?: పాల్వాయి

డిఎల్‌కు షోకాజ్ నోటీసులు ఇవ్వకుండా మంత్రి మండలి నుంచి బర్తరఫ్ చేయడం సరికాదని పాల్వాయి గోవర్ధన్ రెడ్డి అన్నారు. డిఎల్‌ను తొలగించే అధికారం సిఎంకు ఉంటుందని, అయితే తొలగించిన విధానం బాగా లేదన్నారు. సిఎం ఆవేశంతో ఈ పని చేశారన్నారు. పార్లమెంటు సమావేశాలలో తెలంగాణ బిల్లు పెట్టే అవకాశం ఉందన్నారు.

English summary

 Congress Party senior leader K Keshava Rao has responded on DL Ravindra Reddy sack from cabinet.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X