తెరాసలోకి వివేక్ సోదరులు: సోనియా గాంధీ కలత

ఇప్పుడు తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసమంటూ కాకా తనయులైన పెద్దపల్లి పార్లమెంటు సభ్యుడు వివేక్, మాజీ మంత్రి వినోద్‌లు తెలంగాణ రాష్ట్ర సమితిలో ఆదివారం చేరుతున్నారు. రెండు రోజుల క్రితం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అధినేత్రిని కలిసినప్పుడు వారి మధ్య ఈ విషయం చర్చకు వచ్చినట్లుగా తెలుస్తోంది. మంద జగన్నాథం వంటి వారిని పక్కన పెడితే కాకా తనయుల చేరిక ఆమెను ఆవేదనకు గురి చేసిందట.
తెలంగాణ రాష్ట్రమే పరిష్కారం: జానా రెడ్డి
కేంద్రం వచ్చే ఎన్నికలలోగా తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తుందన్న నమ్మకం తమకు ఉందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి జానా రెడ్డి అన్నారు. పార్టీ అధిష్టానం తెలంగాణను తేల్చాలనే ఉద్దేశ్యంతో ఉందన్నారు. అందుకోసం ప్రయత్నాలు చేస్తోందన్నారు. అన్ని సమస్యలు పరిష్కారానికి తెలంగాణను తేల్చడమే అన్నారు.
15 రోజుల్లో స్పష్టత: పాల్వాయి
తెలంగాణపై పదిహేను రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశముందని రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి అన్నారు. వచ్చే పార్లమెంటు సమావేశాలలో తెలంగాణ బిల్లు పెట్టే అవకాశముందన్నారు. డిఎల్ రవీంద్రా రెడ్డి ఉద్వాసన సరికాదని, అధిష్టానం అసంతృప్తి మంత్రులను పిలిచి మాట్లాడితే బాగుండేదన్నారు.












Click it and Unblock the Notifications