సోనియా ఇంటి కాపలా కుక్క: కెసిఆర్‌పై మోత్కుపల్లి

తెరాస నేత కడియం శ్రీహరి తనపై కోర్టుకు వెళ్తే అక్కడే అతను దళితుడు కాదని చెబుతానని అన్నారు. తెరాస ఎమ్మెల్యేలు హరీష్ రావు, కెటి రామారావులు కెసిఆర్ దుష్ప్రభావానికి లోనుకాకుండా టిడిపిలో చేరాలని సూచించారు. తెలంగాణ వస్తే దళితుడిని మఖ్యమంత్రి చేస్తానని చెబుతున్న కెసిఆర్ పార్టీ అధ్యక్షుడిగా ఇప్పుడు దళితుడిని చేస్తారా అని సవాల్ చేశారు.
ద్రోహులు, సన్నాసులు అన్న వారినే అతను తెరాసలోకి చేర్చుకుంటున్నారని ఆరోపించారు. కెసిఆర్ పన్నెండేళ్లుగా తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారని మోత్కుపల్లి మండిపడ్డారు. కెసిఆర్‌కు తెలంగాణ కావాలా లేక రాజకీ పార్టీ కావాలా అని ప్రశ్నించారు. ఓట్లు, నోట్లు, సీట్ల కోసమే కెసిఆర్ తాపత్రయపడుతున్నారన్నారు.కెసిఆర్‌కు దమ్ముంటే మళ్లీ మహబూబ్ నగర్ నుండే పోటీ చేయాలని సవాల్ చేశారు. కెసిఆర్ వల్ల తెలంగాణ రాదన్నారు. ఆయన ఓ పొలిటికల్ బ్రోకర్ అని, అధికారంలో ఉండి తెలంగాణ సాధించని నేతలు తోక పార్టీలో చేరి ఎలా సాధిస్తారని ప్రశ్నించారు.
మభ్య పెడుతోంది కెసిఆర్: శ్రీధర్ బాబు
అదిగో తెలంగాణ ఇదిగో తెలంగాణ అంటూ ప్రజలను మభ్య పెట్టింది కెసిఆరేనని మంత్రి శ్రీధర్ బాబు వేరుగా అన్నారు. ఓట్లు, సీట్లే కెసిఆర్ ప్రధాన ధ్యేయమన్నారు. ఆయన ప్రయత్నాలు తెలంగాణ సాధన కోసం కాదన్నారు. ఎమ్మెల్యేల సంఖ్య పెంచుకుంటే తెలంగాణ ఎలా వస్తుందని ప్రశ్నించారు. తెలంగాణపై త్వరలో నిర్ణయం వెలువడుతుందని చెప్పారు.












Click it and Unblock the Notifications