జగన్‌కు ఇంటర్నెట్ అనుమతిపై డిజికి యనమల ప్రశ్న

చంచల్‌గూడ జైల్లో ఇంటర్నెట్‌తో కూడిన కంప్యూటర్‌ను జగన్ వినియోగించుకునేందుకు ఎవరు అనుమతించారని, అధికారుల సహకారంతోనే జైలునుంచి జగన్ రాజకీయ కార్యకలాపాలను సాగిస్తున్న విషయం నిజం కాదా? అని ప్రశ్నించారు. తన లేఖ నేపథ్యంలో వెంటనే సమాచారాన్నివ్వాలని కోరారు. మరోవైపు జైలే వేదికగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యకలాపాలు సాగుతున్నాయని మరో నేత మండవ వెంకటేశ్వర రావు మండిపడ్డారు.
జైలు మాన్యువల్ ఏమిటని జైళ్ల శాఖ డిజిని ఆయన హైదరాబాద్‌లో ప్రశ్నించారు. తమ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఒక్కమాట అన్నందుకే అంత రాద్ధాంతం చేస్తున్నారని, పత్రికల్లో ప్రకటనలిచ్చారని, అసలు జైలు మాన్యువల్ ఏమిటని, ఆ పార్టీకి చెందిన 125 మంది జగన్‌ను జైల్లో కలిసినట్లు జగన్ పార్టీ నాయకురాలు కొండా సురేఖే చెబుతున్నారని, మరో నేత దాడి వీరభద్రరావు కూడా చెప్పారని అన్నారు.
మరి జైలు నుంచి ఇన్ని రాజకీయ కార్యకలాపాలు సాగుతుంటే మీరెందుకు ఖండించలేదన్నారు. ప్రభుత్వానికి ఈ వ్యవహారాలు కనిపించట్లేదా?' అని ముఖ్యమంత్రిని, జైళ్ల శాఖ మంత్రితోపాటు జైళ్ల శాఖ డిజిని ప్రశ్నించారు. జైలులో జగన్ సాగిస్తున్న ములాఖత్‌లను కాదనగలరా? అని మండిపడ్డారు. జగన్ దోచుకున్నాడు, దాచుకున్నాడని స్వయంగా మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డే చెబుతున్నారని, మరి చంద్రబాబు మాటల్లో తప్పెక్కడుందన్నారు.
అనంతపురం జైల్లో మొద్దు శీను హత్యకు గురైన వైనం తెలియదా అని ప్రశ్నించారు. అవినీతి లేకుండా ఈ దేశం నడుస్తోందా? అని అనుమానించే స్థాయిలో వైయస్ రాజశేఖర రెడ్డి, జగన్‌లు అవినీతిని రాజమార్గంగా చేశారన్నారు. జగన్‌ను జైలులో ఎంతమంది కలుస్తున్నారు, ఎవరెవరి పేర్లతో ఎవరెవరు కలిశారని, బినామీ పేర్లతో ఆ పార్టీ నేతలే కలుస్తున్నట్లుగా తెలుస్తోందని, ఆ వివరాలను బయటపెట్టాలని డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications