డిఎల్‌పై గొంతు పెంచిన కిరణ్ కుమార్ రెడ్డి వర్గం

DL Ravindra Reddy
హైదరాబాద్: బర్తరఫ్‌కు గురైన మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డిపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వర్గం గొంతు పెంచింది. డిఎల్ రవీంద్రా రెడ్డి ముఖ్యమంత్రిపై విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ఆ వర్గం ముందుకు వచ్చింది. డిఎల్ రవీంద్రా రెడ్డి బర్తరఫ్‌ను సమర్థిస్తూ, ఆయనను తప్పు పడుతూ ప్రకటనలు చేస్తోంది. మంత్రి మండలి నుంచి డిఎల్ రవీంద్రా రెడ్డిని బర్తరఫ్ చేసినందుకు కాంగ్రెసు ఎమ్మెల్సీ చెంగలరాయుడు సంతోషం వ్యక్తం చేశారు. అందుకు కిరణ్ కుమార్ రెడ్డికి ఆయన డబుల్ థ్యాంక్స్ చెప్పారు.

కడప జిల్లాలో రవీంద్రా రెడ్డి కాంగ్రెసు పార్టీని నష్టపరిచారని ఆయన విమర్శించారు. ఉప ఎన్నికల్లో, స్థానిక సంస్థల ఎన్నికల్లో డిఎల్ పార్టీ అభ్యర్థుల ఓటమికి పనిచేశారని ఆయన నిందించారు. ప్రభుత్వ పథకాలు అమలు జరగడం లేదనే డిఎల్ రవీంద్రారెడ్డి విమర్శలను ఆయన ఖండించారు.

ప్రభుత్వ పథకాలను డిఎల్ రవీంద్రా రెడ్డి బహిరంగంగా విమర్శించడం కాంగ్రెసు శ్రేణులను బాధపెట్టిందని ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణా రెడ్డి అన్నారు. లోపాలుంటే సూచనలు చేయాలి గానీ విమర్శించడం సమంజసం కాదని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. అధిష్టానం ఆదేశం మేరకే డిఎల్‌ను ముఖ్యమంత్రి బర్తరఫ్ చేసి ఉంటారని ఆయన చెప్పారు. ఇతరులను బెదిరించేందుకు వేటు వేశారని తాను అనుకోవడం లేదని అన్నారు.

మంత్రి మండలిలో ఎవరిని ఉంచాలో, ఎవరి తీసేయాలో నిర్ణయించుకునే స్వేచ్ఛ ముఖ్యమంత్రికి ఉందని ఎఐసిసి కార్యదర్శి పొంగులేటి సుధాకర్ రెడ్డి అన్నారు. కాంగ్రెసు అధిష్టానం అనుమతితోనే డిఎల్ రవీంద్రా రెడ్డి విషయంలో ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారని ఆయన చెప్పారు. సీనియర్ మంత్రులు పార్టీ కోసం పనిచేస్తే మంచిదని ఆయన అభిప్రాయపడ్డారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+