బాబు జైలు వద్ద కాపలా ఉండాలి: జగన్ పార్టీ ఎద్దేవా

తమ పార్టీని ప్రజలు ఆదరిస్తున్నారని, అది టిడిపి, కాంగ్రెసులకు మింగుడు పడటం లేదన్నారు. జైల్లో ఉన్న జగన్ పైన బాబుతో సహా ఆయన అనుచరులు కారుకూతలు కూస్తున్నారని, తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న బాబుకు జైళ్ల శాఖపై ఆరోపణలు చేస్తూ ఖైదీలు నీలి చిత్రాలు చూస్తున్నారని వ్యాఖ్యానించడం శోచనీయమన్నారు.
జైల్లో జగన్‌కు అదనపు సౌకర్యాలు కల్పిస్తున్నారని టిడిపి నేత యనమల రామకృష్ణుడు, జైళ్ల శాఖ డిజిపై టిడిపి నేత మండవ వెంకటేశ్వర రావు ఆరోపణలు సరికాదన్నారు. జళ్ల శాఖపై నమ్మకం లేకుంటే బాబుపై నేరం మోపి జైలుకు పంపితే జగన్ దినచర్యలు కళ్లారా చూసి సంతోషిస్తారన్నారు. బాబు జైలు వద్ద కాపలా కాస్తే జగన్‌ను ఎవరెవరు కలుస్తున్నారో స్వయంగా తెలుసుకోవచ్చునని సంకినేని ఎద్దేవా చేశారు.
సాయిరెడ్డి దర్శనంపై చెవిరెడ్డి వివరణ
టిటిడి ట్రస్టు బోర్డు మాజీ సభ్యుడు విజయ సాయి రెడ్డి కుటుంబ సభ్యులు నిబంధనల మేరకే శ్రీవారి దర్శనం చేసుకున్నారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత చెవిరెడ్డి భాస్కర రెడ్డి చిత్తూరు జిల్లాలో చెప్పారు. విజయ సాయి రెడ్డి తిరుమల పర్యటనపై విమర్శలు రావడంతో ఆయన వివరణ ఇచ్చారు.












Click it and Unblock the Notifications