ఒకే ఛార్జీషీట్ వేయాలి: జగన్ లాయర్, కుదరదని సిబిఐ

కాగా, అన్నిటిపైనా ఒకేసారి విచారణ చేపట్టాలని వైయస్ జగన్, జగతి ఆడిటర్ విజయ సాయి రెడ్డి దాఖలు చేసిన పిటిషన్లపై నాంపల్లి సిబిఐ కోర్టులో బుధవారం రెండు పక్షాల వాదనలు పూర్తయ్యాయి. దీంతో ఈ నెల 10న తీర్పు వెలువరిస్తామని న్యాయమూర్తి ప్రకటించారు.
అంతకుముందు సిబిఐ లాయర్ వాదన వినిపిస్తూ- ఎ అనే వ్యక్తి ఇచ్చిన పరికరంతో బి అనే వ్యక్తి వేర్వేరు జిల్లాల్లో వేర్వేరు ఇళ్లలో చోరీ చేస్తే, పరికరం ఒకటే కాబట్టి అన్నిటినీ ఒకే కేసుగా చూడగలమా? ఇక్కడా అంతే!నని పేర్కొన్నారు. అలాగే కొందరిని సాక్షులుగా, మరికొందరిని నిందితులుగా చేర్చడం ఉద్దేశపూర్వకమేనన్న డిఫెన్స్ న్యాయవాది ఆరోపణ కూడా సరికాదన్నారు. దీనిపై డిఫెన్స్ న్యాయవాది స్పందిస్తూ- వేర్వేరు అంశాలు గనుక చార్జిషీట్లు వేర్వేరుగా వేసేందుకు కోర్టు అనుమతిచ్చినా విచారణ మాత్రం అన్నిటిపైనా ఒకేసారి జరగాలన్నారు.
ఒక్క ఎఫ్ఐఆర్‌పై దేశంలో ఎక్కడా విడివిడిగా విచారణ జరగలేదని తెలిపారు. ఆరోపణలు, సాక్షులు ఒకటే అయినపుడు ట్రయల్ కూడా జాయింట్‌గానే సాగాలని కోరారు. మరోవైపు సాయిరెడ్డి దాఖలు చేసిన డిశ్చార్జ్ పిటిషన్లపై విచారణ 19కి వాయిదా పడింది.












Click it and Unblock the Notifications