లాబీయింగ్‌కు రాలేదు: దామోదర, డిఎల్ ఫోన్‌కి నిధులు

Damodara Rajanarasimha
న్యూఢిల్లీ: హోంశాఖ బాధ్యతలపై ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ శుక్రవారం స్పందించారు. ఆయన న్యూఢిల్లీ నుండి రాష్ట్రానికి బయలుదేరిన సమయంలో విలేకరులు పలకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను హోంమంత్రి పదవి కోసం ఢిల్లీకి రాలేదని చెప్పారు. ఒకవేళ అధిష్టానం నిర్ణయం తీసుకుంటే అప్పుడు చూద్దామని ఆయన అన్నారు.

అధిష్టానం పెద్దలతో తన భేటీలకు ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదన్నారు. నామినేటెడ్ పోస్టుల భర్తీ, స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చించేందుకు తాను వచ్చినట్లు చెప్పారు. పార్టీ బలోపేతం, తెలంగాణ వంటి అంశాలపై తాను అధిష్టానం పెద్దలతో మాట్లాడానని అన్నారు. తెలంగాణపై కేంద్రం, అధిష్టానం సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటుందన్నారు. కాగా రాహల్ గాంధీని కలవాలని దామోదర ప్రయత్నించనా అపాయింటుమెంట్ దొరకలేదు.

డిఎల్ ఫోన్‌కు నిధులు మంజూరు

మాజీ మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి గత మార్చిలో మంత్రిగా ఉన్న సమయంలో కొనుగోలు చేసిన ఓ ఫోన్ కోసం గురువారం నిధులు మంజూరు చేస్తు ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. సెల్‌ఫోన్ కొనుగోలుకు నిధులివ్వాలని డిఎల్ ప్రత్యేకాధికారి మార్చి 16న ప్రభుత్వానికి నోట్ పంపించారు. దానికి గాను ఇప్పుడు రూ.13,999 మంజరు చేస్తున్నట్లు ఉత్తర్వులో పేర్కొన్నారు.

తెలంగాణ కోసం బస్సుయాత్ర

శాసనసభలో తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టాలంటూ రాజకీయ ఐక్యకార్యాచరణ సమితి ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా మొయినాబాదులో బస్సు యాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఐకాస చైర్మన్ కోదండరామ్ మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర సాధించే వరకు పోరాటం చేస్తాన్నారు. ఈ నెల 14న నిర్వహించే చలో అసెంబ్లీ కార్యకర్మాన్ని విజయవంతం చేయాలని తెలంగాణ ప్రజలకు పిలుపునిచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+