మంత్రదండం లేదు: తెలంగాణపై రేణుకా చౌదరి

Renuka Chowdhury
న్యూఢిల్లీ/ హైదరాబాద్: తెలంగాణపై ఎఐసిసి అధికార ప్రతినిధి రేణుకా చౌదరి వివాదాస్పదమైన ప్రకటన చేశారు. తెలంగాణ సమస్యను వెంటనే పరిష్కరించలేమని ఆమె అన్నారు. తెలంగాణ అంశం వివిధ రాష్ట్రాలతో ముడిపడి ఉందని, తెలంగాణ ఇస్తే వేరే రాష్ట్రాల్లో సమస్యలు తలెత్తుతాయని ఆమె శుక్రవారం మీడియా ప్రతినిధులతో అన్నారు.

అడిగిన వెంటనే తెలంగాణ ఇవ్వడానికి కాంగ్రెసు చేతిలో మంత్రదండం లేదని ఆమె అన్నారు. తెలంగాణపై ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని ఆమె చెప్పారు. చత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల ఘటనకు నిరసనగా పరివర్తన యాత్ర ఉంటుందని రేణుకా చౌదరి చెప్పారు.

రేణుకా చౌదరి వ్యాఖ్యలు దురదృష్టకరమని కాంగ్రెసు తెలంగాణ పార్లమెంటు సభ్యుడు రాజయ్య అన్నారు. తెలంగాణపై ఇప్పటికే లోతైన చర్చలు జరిగాయని ఆయనఅన్నారు. తెలంగాణ అంశం తుది దశకు చేరుకుందని, త్వరలోని నిర్ణయం వెలువడుతుందని రాజయ్య అన్నారు.

బిజెపిని టార్గెట్ చేయవద్దు...

ఇదిలావుంటే, తెలంగాణవాదులు బిజెపిని లక్ష్యం చేసుకోవద్దని ఆ పార్టీ నాయకుడు నాగం జనార్దన్ రెడ్డి అన్నారు. తెలంగాణ విషయంలో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు, నాయకుడు కె.కేశవరావుల తీరుపై ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో మండిపడ్డారు. యుపిఎ తెలంగాణ ఇవ్వదని తెలిసినా కాంగ్రెసుతో తెరాస చీకటి రాజకీయాలు ఏమిటని ఆయన వ్యాఖ్యానించారు.

బిజెపిపై, తమ పార్టీ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్‌పై వ్యాఖ్యలు తగవని ఆయన అన్నారు. తెలంగాణ కోసం అంత మంది చనిపోతుంటే ముఖ్యమంత్రి, ప్రతిపక్షం ఏం చేస్తున్నట్లు అని ఆయన అడిగారు. తెరాస నాయకుడు నాగరాజు ఆత్మహత్య బాధాకరమని ఆయన అన్నారు. ఇటువంటి సంఘటనలు జరగకుండా జాగ్రత్త పడాలని ఆయన సూచించారు.

కెసిఆర్‌కు చెప్పాల్సింది..

తన అభిప్రాయాలను నాగరాజు కెసిఆర్‌కు చెప్పాల్సి ఉండిందని తెరాస నాయకుడు వినోద్ కుమార్ అన్నారు. నాగరాజును కాపాడడానికి చివరి వరకూ ప్రయత్నించామని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. రాజకీయాల్లో వ్యక్తుల మధ్య భేదాభిప్రాయాలు ఉండడం సహజమని, నాగరాజుకు కూడా అటువంటి అభిప్రాయవిభేదాలున్నాయని తెలిసిందని, ఈ విషయం కెసిఆర్‌కు తెలియనది ఆన్నారు.

నాగరాజు ఆత్మహత్య చాలా బాధాకరమని ఆయన అన్నారు. తెలంగాణవాదాన్ని గట్టిగా వినిపించిన నాయకుడు నాగరాజు అని ఆయన అన్నారు. తాము ఇటువంటి సంఘటనను ఊహించలేదని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+