రేణుకా చౌదరికి పొన్నం హెచ్చరిక: కెసిఆర్‌పై పెద్దిరెడ్డి

Ponnam Prabhakar
హైదరాబాద్: తెలంగాణపై నిర్ణయం తీసుకోవడం ఇప్పట్లో సాధ్యం కాదని ప్రకటించిన ఎఐసిసి అధికార ప్రతినిధి రేణుకా చౌదరిపై కాంగ్రెసు ప్రాంత పార్లమెంటు సభ్యుడు పొన్నం ప్రభాకర్ తీవ్రంగా మండిపడ్డారు. తెలంగాణపై రేణుకా చౌదరి తన పరిధిని మించి మాట్లాడుతున్నారని ఆయన శనివారం మీడియాతో అన్నారు. తెలంగాణపై అనవసరంగా మాట్లాడవద్దని ఆయన ఆమెను హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల్లో జోక్యం చేసుకోకుండా రేణుకా చౌదరిని కట్టడి చేయాలని పార్టీ అధిష్టాన్నీ కోరుతామని ఆయన చెప్పారు.

తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టే విధంగా రేణుకా చౌదరి వ్యాఖ్యలు చేస్తే కాంగ్రెసు పార్టీకి నష్టం వాటిల్లుతుందని ఆయన అన్నారు. తెలంగాణపై రేణుకా చౌదరి కేంద్రానికి తప్పుడు సమాచారం ఇవ్వవద్దని ఆయన సూచించారు. కేంద్రాన్ని అసమర్థ ప్రభుత్వమని వ్యాఖ్యానించిన సీమాంధ్ర పార్లమెంటు సభ్యుడు కావూరి సాంబశివపై లేని చర్చ ఎమ్మెల్సీ యాదవరెడ్డిపై ఎందుకు జరుపుతారని ఆయన ప్రశ్నించారు. యాదవరెడ్డికి తాము అండగా నిలుస్తామని చెప్పారు.

ఇదిలావుంటే, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుపై తెలుగుదేశం పార్టీ నాయకుడు ఇనుగాల పెద్దిరెడ్డి విరుచుకుపడ్డారు. కెసిఆర్‌కు మొదటి ప్రాధాన్యాలు డబ్బు, కుటుంబమని, తెలంగాణ మూడో ప్రాధాన్యమేనని ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. తెలంగాణ ప్రజల సెంటిమెంటును, విద్యార్థుల ఆత్మహత్యలను కెసిఆర్ సొమ్ము చేసుకుంటున్నారని ఆయన ఆరోపించారు.

కెసిఆర్ అంటే కోట్లకు సీట్లు రాసిచ్చే వ్యక్తి అని ఆయన వ్యంగ్యంగా అన్నారు. తెరాస అంటే తెలంగాణ రాకుండా చూసే పార్టీ అని ఆయన వ్యాఖ్యానించారు. బిసీలు, ఉద్యమకారులంటే కెసిఆర్‌కు చులకన భావం ఉందని ఆయన అన్నారు. కేశవరావు ద్వారా ఏ మతలబు జరిగిందో బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. కాంగ్రెసు అధిష్టానంతో ఒప్పందంలో భాగంగానే పార్లమెంటు సభ్యులు తెరాసలో చేరారని ఆయన అన్నారు. కెసిఆర్‌కు సోనియా దేవత అని, కేశవరావు దేవదూత అని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+