మా వాళ్లు వైయస్ జగన్ లెక్క కాదు: కోదండరామ్

Kodandaram
హైదరాబాద్: తమ సంస్థ నాయకులు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అద్యక్షుడు వైయస్ జగన్ మాదిరిగా జైలుకు వెళ్లడం లేదని తెలంగాణ రాజకీయ జెఎసి చైర్మన్ కోదండరామ్ అన్నారు. ఎన్నికలు కూడా తమ ఉద్యమంలో భాగమేనని ఆయన అన్నారు. మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో ఆయన శనివారం మాట్లాడారు. జెఎసి నేతలు రాజకీయ పార్టీల్లో చేరడం తప్పు కాదని ఆయన అన్నారు.

చలో అసెంబ్లీ కార్యక్రమంపై తాము ఎల్లుండి భాగస్వామ్య పక్షాలతో చర్చిస్తామని ఆయన చెప్పారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా చలో అసెంబ్లీ కార్యక్రమం నిర్వహిస్తామని అన్నారు. ఇందిరా పార్కు నుంచి అసెంబ్లీ వరకు తాము ర్యాలీ నిర్వహిస్తామని ఆయన చెప్పారు. పద్ధతి ప్రకారం ప్రభుత్వ అనుమతి అడిగినట్లు తెలిపారు. తమను అడ్డుకుంటే కాంగ్రెసు ప్రజాప్రతినిధులకు తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని ఆయన అన్నారు.

ప్రభుత్వానికి ఇవే చివరి అసెంబ్లీ సమావేశాలని, ఆరునూరైనా ఈనెల 14న ఛలో అసెంబ్లీ నిర్వహిస్తామని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నేత ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు. శనివారం ఉదయం 'ఛలో అసెంబ్లీ' పోస్టర్‌ను ఆయన విడుదల చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో తెలంగాణపై తీర్మానానికి అన్ని పార్టీలు చొరవ తీసుకోవాలని ఆయన కోరారు. స్పాట్ ఫిక్సింగ్‌తో సంబంధం ఉందని ఆరోపణలు ఎదుర్కుంటున్న బోధన్ ఇన్‌చార్జి షకీల్‌పై పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఈటెల తెలిపారు.

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నియంతలా వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు. చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని నీరుగార్చేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆయన విమర్శించారు. ఈ కార్యక్రమానికి వచ్చే వాహనాలను అడ్డుకునేందుకు వ్యూహాలు రచిస్తోందని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+