జగన్ కేసు: సబితా, ధర్మానలకు కోర్టు నోటీసులు

Sabitha Indra Reddy and Dharmana Prasad Rao
హైదరాబాద్: మాజీ మంత్రులు ధర్మాన ప్రసాదరావు, సబితా ఇంద్రారెడ్డిలకు నాంపల్లి కోర్టు సోమవారం నోటీసులు జారీ చేసింది. వారిద్దరిని జ్యుడిషియల్ కస్టడీకి పంపాలని కోరుతూ సిబిఐ దాఖలు చేసిన మెమోను న్యాయస్థానం విచారణకు స్వీకరించింది. ధర్మానపై అవినీతి నిరోధక చట్టం అభియోగాలను పరిగణనలోకి తీసుకోవాలన్న మెమోను కూడా కోర్టు విచారణకు స్వీకరించింది.

విచారణను ఈ నెల 13వ తేదీకి కోర్టు వాయిదా వేసింది. సబితా ఇంద్రారెడ్డి, ధర్మాన ప్రసాదరావు మీడియాతో మాట్లాడిన అంశాలను లిఖికపూర్వకంగా తమకు సమర్పించాలని, మీడియాతో వారు ఏం మాట్లాడారో తెలపాలని కోర్టు సిబిఐని ఆదేశించింది.

ఈ నెల 13వ తేదీన నిందితుల తరఫు న్యాయవాదులు కౌంటర్ దాఖలు చేసే అవకాశం ఉంది. లేదంటే, కౌంటర్ దాఖలు చేయడానికి సమయం కోరే అవకాశం కూడా ఉంది. ధర్మాన ప్రసాదరావు, సబితా ఇంద్రారెడ్డిలను జ్యుడిషియల్ కస్టడీకి అప్పగించాలని సిబిఐ ఇది వరకు పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. వారు కేసు దర్యాప్తును ప్రభావితం చేసే అవకాశం ఉందని, అందువల్ల వారిని జ్యుడిషియల్ కస్టడీకి అప్పగించడం అవసరమని సిబిఐ కోర్టుకు తెలిపింది.

సబితా ఇంద్రారెడ్డి, ధర్మాన ప్రసాదరావు కేసు దర్యాప్తును ప్రభావితం చేసే విధంగా మాట్లాడారని, వారిని జ్యుడిషియల్ కస్టడీకి పంపించకపోతే దర్యాప్తుపై ప్రభావం చూపే అవకాశం ఉంటుందని సిబిఐ కోర్టుకు విన్నవించుకుంది. అయితే, తాము దర్యాప్తును ప్రభావితం చేసే విధంగా ఏమీ మాట్లాడలేదని, తాము ఏ తప్పూ చేయలేదని, కేసు నుంచి నిర్దోషులుగా బయటపడుతామని మాత్రమే చెప్పామని వారన్నారు.

ధర్మాన ప్రసాదరావును వాన్‌పిక్‌ వ్యవహారంపై కోర్టుకు సమర్పించిన చార్జిషీట్‌లో నిందితుడిగా సిబిఐ చేర్చింది. సబితా ఇంద్రారెడ్డిని దాల్మియా సిమెంట్స్ కేసులో నిందితురాలిగా చేర్చింది. ఈ నేపథ్యంలో వారిద్దరు మంత్రి పదవులకు రాజీనామా చేయాల్సి వచ్చింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+