జగన్‌ను జైల్లోను ఉండనివ్వరా: బాబుపై దాడి నిప్పులు

Dadi Veerabhadra Rao
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పైన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత దాడి వీరభద్ర రావు సోమవారం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తమ పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని జైలులో కూడా ఉండనివ్వరా అని ప్రశ్నించారు.

చంద్రబాబు రాయమంటేనే టిడిపి శాసన మండలి సభ్యుడు యనమల రామకృష్ణుడు లేఖలు రాస్తున్నారని ఆయన ఆరోపించారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన కోపం ఉంటే ఆయనను రాజకీయంగా ఎదుర్కోవాలే తప్ప ఇలాంటి కుతంత్రాలు చేయకూడదని టిడిపికి సవాల్ విసిరారు.

చంద్రబాబు తన విశ్వసనీయతను తానే చంపుకుంటున్నారన్నారు. ఎదుటివారిని ఎలా దెబ్బతీయాలనే చంద్రబాబు నిత్యం ఆలోచిస్తుంటారని మండిపడ్డారు. జగన్‌ను జైలులో కూడా ఉండనివ్వకుండా ఆయనను ఏం చేయదలుచుకున్నారో చెప్పాలని విరుచుకుపడ్డారు. జైలులో జగన్ గదికి అడ్డుగా గోడలు ఏమైనా కట్టాలా అని ప్రశ్నించారు.

తాను తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు చంచల్ గూడ జైలులో నూకారపు సూర్య ప్రకాశ్‌ను కలిశానని, నియమ నిబంధనల మేరకే జైళ్లు పని చేస్తున్నాయని చెప్పారు. రాష్ట్రంలో సిబిఐ చంద్రబాబు బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్‌గా మారిందని ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+