వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణపై పట్టు: కుదరదన్నకిరణ్, ఒప్పించాలని టిడిపి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kiran Kumar Reddy
హైదరాబాద్: తెలంగాణపై అసెంబ్లీలో తీర్మానం ప్రవేశ పెట్టాలని తెలంగాణ రాష్ట్ర సమితి శాసనసభా పక్ష నేత ఈటెల రాజేందర్ చేసిన సూచనను ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సోమవారం తిరస్కరించారు. అసెంబ్లీ రేపటికి వాయిదా పడిన అనంతరం బిఏసి సమావేశం జరిగింది. ఈ భేటీలో పాల్గొన్న ఈటెల తెలంగాణపై తీర్మానం ప్రవేశపెడితే సమావేశాలు సజావుగా సాగేందుకు కృషి చేస్తామని ఆయన ప్రభుత్వానికి చెప్పారు. లేదంటే సభను అడ్డుకుంటామన్నారు.

దీనికి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి స్పందిస్తూ... తెలంగాణ అంశం తమ చేతుల్లో లేదని, దీనిపై తీర్మానం సాధ్యంకాదని తేల్చి చెప్పారు. దీంతో తెలుగుదేశం పార్టీ నేత మోత్కుపల్లి నర్సింహులు స్పందిస్తూ... మీరే అధిష్టానాన్ని, కేంద్రాన్ని ఒప్పించవచ్చు కదా అని ప్రశ్నించారు. తెలంగాణపై తీర్మానం ప్రవేశ పెట్టాలని సిబిఐ, భారతీయ జనతా పార్టీ కూడా కోరాయి.

తెలంగాణపై తీర్మానం పెట్టాలని, బయ్యారంలోనే స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని సిపిఐ ఎమ్మెల్యే గుండా మల్లేష్ కోరారు. పార్లమెంటులో తెలంగాణ బిల్లు పెట్టాలని అసెంబ్లీలో తీర్మానం చేయాలని బిజెపిఎల్పీ యెండల లక్ష్మీ నారాయణ కోరారు. విద్యార్థులపై బైండోవర్ కేసులు ఎత్తివేయాలన్నారు.

మరోవైపు తమ ఛలో అసెంబ్లీ కార్యక్రమానికి అనుమతివ్వాలని, తాము ఎప్పుడో అనుమతి కోసం లేఖ రాశామని, అనుమతివ్వకుంటే తదనంతర పరిణామాలకు తాము బాధ్యులం కామని టిజెఏసి చైర్మన్ కోదండరామ్ అన్నారు.

అవిశ్వాసానికి టిడిపి దూరం

తెలుగుదేశం పార్టీ ఈ సమావేశాల్లో అవిశ్వాసానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. ఎవరో పెట్టిన డిమాండ్స్‌కు మనం స్పందించడమేమిటని ఎమ్మెల్యేలు సూచించడంతో అవిశ్వాసం వద్దని నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. తాము అవిశ్వాసం పెడితే బెదిరింపులు, బ్లాక్ మెయిల్‌లకు పాల్పడి ఆ పార్టీలో లబ్ధి పొందాలని చూస్తున్నాయని టిడిఎల్పీ భావిస్తోంది.

English summary

 Chief Minister Kiran Kumar Reddy on Monday ruled out passing a resolution in the Assembly seeking creation of separate Telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X