వేటు: క్రికెట్ నుండి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా సస్పెండ్

స్పాట్ ఫిక్సింగ్ వ్యవహారంలో చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్ల యాజమాన్యాలు ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. చెన్నై సూపర్ కింగ్స్ మాజీ సిఈవో గురునాథ్ మీయప్పన్‌ను పోలీసులు కొద్ది రోజుల క్రితం ఫిక్సింగ్ వ్యవహారంపై అరెస్టు చేశారు. రెండు రోజుల క్రితమే అతను బెయిల్ పైన విడుదలయ్యారు.
ఇదే సమయంలో రాజస్థాన్ రాయల్స్ జట్టు సహ యజమాని రాజ్ కుంద్రా బెట్టింగ్స్ వ్యవహారం బయటపడింది. ఆయనను పోలీసులు పిలిచి విచారించారు. ఢిల్లీ పోలీసుల విచారణలో రాజ్ కుంద్రా తాను బెట్టింగ్స్‌కు పాల్పడినట్లుగా అంగీకరించారు. ఈ విషయాన్ని పోలీసులు కూడా చెప్పారు.
ఈ నేపథ్యంలో ఆయనను సస్పెండ్ చేస్తూ... ఇక నుండి అతను క్రికెట్ కార్యకలాపాల్లో పాల్గొనకుండా వేటు వేసింది. జట్టు నిర్ణయాల్లో కుంద్రా పాత్ర లేదని, ఆయన తప్పు చేసినట్లు తెలిస్తే గెంటివేస్తామని జట్టు మిగిలిన యాజమాన్యం కూడా తెలిపింది. అత్యవసర భేటీలో రాజ్ కుంద్రా పైన వేటు పడింది.












Click it and Unblock the Notifications