నాతో పెట్టుకుంటే నీకే నష్టం: టిఎస్సార్‌కు దగ్గుబాటి

Daggubati Venkateswara Rao
హైదరాబాద్: తనతో పెట్టుకుంటే రాజ్యసభ సభ్యుడు టి.సుబ్బిరామి రెడ్డికే నష్టమని కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత దగ్గుబాటి వెంకటేశ్వర రావు మంగళవారం హెచ్చరించారు. ఆయన పంపిన లీగల్ నోటీసుల అంశం తాను కోర్టులోనే తేల్చుకుంటానని చెప్పారు. తనను రెచ్చగొట్టవద్దని, అదే చేస్తే చాలా విషయాలు బయట పెట్టాల్సి ఉంటుందని హెచ్చరించారు. తమ ఇద్దరి వివాదం వల్ల పార్టీకి ఎలాంటి నష్టం లేదని దగ్గుబాటి వివరించారు. ఆయన ఈ రోజు అసెంబ్లీ లాబీల్లో టిఎస్సార్ లీగల్ నోటీసుపై స్పందించారు.

తనపై చేసిన ఆరోపణలకు గాను టిఎస్సార్ సోమవారం దగ్గుబాటికి లీగల్ నోటీసులు పంపిన విషయం తెలిసిందే. ఆ తర్వాత సాయంత్రం టిఎస్సార్ మాట్లాడుతూ... భార్య దగ్గుబాటి పురంధేశ్వరిని చూసి వెంకటేశ్వర రావు సంస్కారం నేర్చుకోవాలని అన్నారు. తెలుగుదేశం, బిజెపిల నుంచి వచ్చిన దగ్గుబాటి వెంకటేశ్వర రావే అలా మాట్లాడితే 30 ఏళ్లు కాంగ్రెసు పార్టీలో ఉన్న తాను ఎలా మాట్లాడాలని ఆయన సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో ప్రశ్నించారు.

కేంద్ర మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి భర్త, శాసనసభ్యుడు దగ్గుబాటి వెంకటేశ్వర రావుతో తనకు ఏ విధమైన శత్రుత్వంలేదని, తన పరువు తీసేందుకు ప్రయత్నించడం వల్లనే బాధగా ఉందని ఆయన అన్నారు. తనపై చేసిన విమర్శలకు దగ్గుబాటి వెంకటేశ్వర రావు పది రోజుల్లో క్షమాపణ చెప్పకపోతే పరువు నష్టం దావా వేస్తానని ఆయన హెచ్చరించారు. ఉద్దేశ్యపూర్వకంగానే దగ్గుబాటి వెంకటేశ్వర రావు తనపై విమర్శలు చేశారని ఆయన అన్నారు. అభ్యర్థుల శక్తి సామర్థ్యాలను బట్టే ఎన్నికల్లో టికెట్లు లభిస్తాయని ఆయన అన్నారు.

తెలంగాణపై తీర్మానం పెట్టాలి: ఈటెల

తెలంగాణపై అసెంబ్లీలో తీర్మానం పెట్టాల్సిందేనని టిఆర్ఎస్ఎల్పీ ఈటెల రాజేందర్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో పార్టీలలో ఏకాభిప్రాయం లేదని కేంద్రమంత్రి చిదంబరం అన్నారని చెప్పారు. తెలంగాణపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కుమ్మక్కయ్యారన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఏమీ మాట్లాడటం లేదన్నారు. తీర్మానం పెడితే ఆ మూడు పార్టీల రంగు తెలిసిపోతుందన్నారు. మరోవైపు తెలంగాణపై పంచాయతీ ఎన్నికలలో ఏం చెప్పాలనేది నిర్ణయించుకుంటామన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+