బాబుకి కోపమెందుకో: జెసి, శకుని మామ: టిడిపి

JC Diwakar Reddy
హైదరాబాద్: శాసన సభలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితి గత మప్పై ఏళ్లలో ఎప్పుడు తాను చూడలేదని కాంగ్రెసు పార్టీ సీనియర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జెసి దివాకర్ రెడ్డి బుధవారం అన్నారు. అసెంబ్లీ సమావేశాలు గురువారానికి వాయిదా పడిన అనంతరం ఆయన మాట్లాడారు. ప్రతి పక్షం చొరవ తీసుకొని సభ సజావుగా సాగేలా సహకరించాలని కోరారు.

అవసరమైతే తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యేలను బయటకు పంపించైనా సభను నిర్వహించాలన్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు ఎందుకు కోపం వచ్చిందో తెలియదన్నారు. కుమ్మక్కు వ్యాఖ్యలపై చంద్రబాబు నాయుడు మండిపడ్డ విషయం తెలిసిందే.

అవమానించడమే: గాలి

సభలో తమకు మైక్ ఇచ్చి, కట్ చేయడమంటే ప్రతిపక్షాన్ని అవమానించడమేనని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత గాలి ముద్దుకృష్ణమ నాయుడు అన్నారు. ఆర్థిక శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్ని విషయాలపై మాట్లాడవచ్చు కానీ.. తాము ఏం మాట్లాడాలో స్పీకర్ చెబుతారా అని ప్రశ్నించారు. అసెంబ్లీ ఏ ఒక్కరి సొత్తు కాదన్నారు. ఆనం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఎవరికి మేనమామ కాదని టిడిపి నాయకులు రాజేంద్ర ప్రసాద్ అన్నారు. కాంగ్రెసు నేతలు ఎవరు చంద్రబాబును కలవాల్సిన అవసరం లేదన్నారు. జెసి దివాకర్ రెడ్డిని కాంగ్రెసుకు శకుని మామగా ఆయన అభివర్ణించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+