చలో అసెంబ్లీకి అనుమతి అసాధ్యం: అనురాగ్ శర్మ

గతంలో కూడా ప్రశాంతంగా నిర్వహిస్తామని చెప్పారని, దాంతో అనుమతి ఇచ్చామని, కానీ హింస జరిగిందని ఆయన అన్నారు. అయితే, ప్రజాస్వామ్య పద్ధతిలో నిర్వహించే కార్యక్రమాలకు తాము అనుమతి ఇవ్వబోమని తాను చెప్పడం లేదని, తెలంగాణ రాష్ట్ర సమితి, బిజెపిలు నిజాం కళాశాల మైదానంలో నిర్వహించిన సభలకు తాము అనుమతి ఇచ్చామని ఆయన అన్నారు. ప్రజాస్వామ్య ప్రక్రియను తాము అడ్డుకోవడం లేదని అన్నారు.
చలో అసెంబ్లీ కార్యక్రమంలో అసాంఘిక శక్తులు చొరబడే ప్రమాదం ఉందని, మిలిటెంట్‌గా చలో అసెంబ్లీ నిర్వహిస్తామని కూడా ప్రకటించారని, ఈ దృష్ట్యా తాము అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామని ఆయన చెప్పారు. హైదరాబాద్ శివారుల్లో 17 చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. అసెంబ్లీ వైపు వస్తే నిలిపేస్తామని అన్నారు. వైన్ షాపులు, బార్లు కూడా మూసి ఉంటాయని ఆయన అన్నారు. కేంద్ర బలగాలు కూడా వస్తున్నాయని, బయటి నుంచి బలగాలను రప్పించామని అన్నారు.
తమ విధులు నిర్వహించడానికి తాము సిద్దంగా ఉన్నామని, చట్టాన్ని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, 144వ సెక్షన్ విధించామని అనురాగ్ శర్మ చెప్పారు. ప్రధాన కూడళ్లలో, వీధుల్లో కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. చలో అసెంబ్లీ కార్యక్రమంలో విద్యార్థులు, ప్రభుత్వ ఉద్యోగులు కూడా పాల్గొంటారనే సమాచారం ఉందని, వారికి భవిష్యత్తులో సమస్య తలెత్తవచ్చునని ఆయన అన్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థులు పోలీసులపైకి రాళ్లు రువ్వారని, పోలీసులు రెండు విడతలు బాష్పవాయు ప్రయోగం చేశారని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications