తెగదెంపుల వార్తలు: నితీష్, శరద్‌లకు అద్వానీ ఫోన్

అద్వానీ బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌తోనూ జెడి(యు) అధ్యక్షుడు శరద్ యాదవ్‌తోనూ మాట్లాడినట్లు తెలుస్తోంది. ఎన్డీఎ ఐక్యంగా ఉండి, కలిసికట్టుగా వచ్చే ఎన్నికలను ఎదుర్కోవాల్సిన అవసరం ఉందని అద్వానీ వారితో అన్నట్లు సమాచారం. గుజారత్‌లో బిజెపితో తెగదెంపులు చేసుకోవడానికి కూడా జెడి(యు) సిద్ధపడినట్లు తెలుస్తోంది.
అయితే, బిజెపితో తెగదెంపులు చేసుకోవడానికే జెడి(యు) మొగ్గు చూపుతున్నట్లు అర్థమవుతోంది. బిజెపిలో అద్వానీ యుగం ముగిసిందని, బిజెపితో పొత్తుపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని జెడి(యు) నేత శివానంద్ తివారీ బుధవారం చెప్పారు. అద్వానీ చాలా సీనియర్ నాయకుడని, అయితే అద్వానీ స్థాయిని తగ్గించారని, అద్వానీ దశ ముగిసిందని, తప్పుకునే వయస్సులో ఉన్నారని శివానద తీవారీ అన్నారు.
బిజెపి ప్రచార కమిటీ సారిథిగా నియమించడం నరేంద్ర మోడీని పరోక్షంగా ప్రధాని అభ్యర్థిగా ముందుకు తేవడమేనని ఆయన అన్నారు. ఈ విషయాన్ని తాము తీవ్రంగా పరిగణనలోకి తీసుకుంటామని ఆయన చెప్పారు. బిజెపి, జెడి(యు) సంబంధాలపై ఒకటి, రెండు రోజుల్లో తుది నిర్ణయం తీసుకుంటామని తివారీ చెప్పారు. కాగా, ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటును పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ముందుకు తెచ్చి నితీష్ కుమార్‌తో తాను ఈ విషయంపై మాట్లాడినట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications