జగన్‌పార్టీని చూస్తే భయం, అమ్మో.. బతికిపోయా: ఆనం

ఈ సందర్భంగా ఆనం మీడియాతో పిచ్చాపాటిగా మాట్లాడారు. తనకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అంటేనే భయమేస్తోందని ఎద్దేవా చేశారు. జగన్ గురించి మాట్లాడడమెందుకు, ఆ పార్టీతో తన్నులు తినడమెందుకని ప్రశ్నించారు. వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో తనకు ఏ మంత్రి పదవి రాలేదని, అందుకే బతికిపోయానని చెప్పారు. లేదంటే జగన్ కంటే ముందే తాను జైలులో ఉండేవాడినని సెటైర్ వేశారు.
తాను చైన్ స్నాచర్లతో తన్నులు తినగలనా అన్నారు. జగన్ తన పక్కునున్న వారినే నమ్మలేడన్నారు. జగన్‌ను ఆనం పోతురాజుతో పోల్చారు. ఇప్పటికే కాళ్లు, చేతులు పడిపోయి ఓ అధికారి, మేనత్త సబితా ఇంద్రా రెడ్డి, శిష్యుడు మోపిదేవి వెంకటరమణ, సహపాటి ధర్మాన ప్రసాద రావులు బలయ్యారని, ఇంకెందరు బలి కావాలో అన్నారు. తమ సోదరుడికి వైయస్ హయాంలో మంచి పోర్టు పోలియే రాకపోవడం వల్ల బతికిపోయామన్నారు. చంద్రబాబు హయాం నుండి అసెంబ్లీ లాబీల్లో కలవడం ఆనవాయితీగా మారిందన్నారు.
గవర్నర్‌ను కలిసిన వైయస్సార్ కాంగ్రెసు ఎమ్మెల్యేలు
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యేలు గురువారం గవర్నర్ నరసింహన్‌ను కలిశారు. జగన్ కేసులో సిబిఐ పని తీరును తప్పుపడుతూ వారు ఫిర్యాదు చేశారు. గవర్నర్‌ను కలిసిన అనంతరం వారు మాట్లాడుతూ.. జగన్‌ను అక్రమంగా జైలులో పెట్టారని, టిడిపి, కాంగ్రెసు కుమ్మక్కయ్యాయని ఆరోపించారు. జగన్ కేసు అంశంపై న్యాయపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. గవర్నర్‌ను కలిసిన వారిలో శోభా నాగి రెడ్డి, సుచరిత, బాలరాజు, పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి, ధర్మాన కృష్ణ దాసు, గొల్ల బాబురావు, శ్రీకాంత్ రెడ్డి తదితరులు ఉన్నారు.












Click it and Unblock the Notifications