కుమ్మక్కు ప్రచారం: శ్రీధర్, గండ్రలకు నో చెప్పిన బాబు

బుధవారం మాజీ మంత్రులు జెసి దివాకర్ రెడ్డి, శంకర రావులు తనను కలిసి వెళ్లిన అంశం రాద్దాంతం కావడంతో ఆయన అప్పుడే ఆగ్రహం వ్యక్తం చేశారు. జెసి, శంకర రావులు కలిసి వెళ్లడంపై వివిధ రకాల ప్రచారం సాగింది. ఇది చంద్రబాబుకు ఆగ్రహం తెప్పించింది. దీంతో అప్పుడే తన ఛాంబర్‌లోకి కాంగ్రెసు నేతలను రానివ్వవద్దని హుకూం జారీ చేశారు. ఈ రోజు గండ్ర, శ్రీధర్ బాబులు వచ్చినా నో చెప్పారు.
అసెంబ్లీ అరగంట వాయిదా
ఈ రోజు ఉదయం అసెంబ్లీ ప్రారంభమైన కాసేపటికే అరగంట వాయిదా పడింది. నిత్యవసర వస్తువుల ధరల పెరుగుదలపై శాసనసభలో చర్చించేందుకు టిడిపి, నల్గొండ జిల్లాలో బాలికపై అత్యాచారం, హత్య కేసులో నిందితులను అరెస్టు చేయాలని మజ్లిస్, నిత్యావసర ధరలపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ, చలో అసెంబ్లీ నేపథ్యంలో అరెస్టులు, బైండోవర్లపై సిపిఐ, రజక వృత్తిదారుల సమస్యలపై సిపిఎం, తెలంగాణ తీర్మానం, అరెస్టులపై బిజెపి, వేణుగోపాల చారి, తెరాస వాయిదా తీర్మానాలు ఇచ్చాయి. వాటిని స్పీకర్ తిరస్కరించడంతో సభ్యులు ఆందోళనకు దిగారు. దీంతో సభను అరగంట పాటు వాయిదా వేశారు. ఫ్లోర్ లీడర్లను సభాపతి తన ఛాంబర్‌కు పిలిపించి మాట్లాడారు.
అంతకుముందు చంద్రబాబు మాట్లాడుతూ... నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే కారణమని టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు విమర్శించారు. గన్ పార్కు వద్ద టిడిపి వంటా వార్పును చేపట్టింది. నిత్యావసర వస్తువుల ధరలు తగ్గిస్తామని కాంగ్రెసు ఎన్నికల ప్రణాళికలో చెప్పి, అధికారంలోకి వచ్చాక విపరీతంగా ధరలు పెంచిందని ఆరోపించారు.












Click it and Unblock the Notifications