బంగారుతల్లిపై జానా సంచలనం: ఓయులో టియర్ గ్యాస్

 Jana Reddy comments on Bangaru Talli, Kadiyam arrest
హైదరాబాద్: పంచాయతీరాజ్ శాఖ మంత్రి జానా రెడ్డి గురువారం బంగారు తల్లి పథకంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. బంగారు తల్లి పథకంపై అసెంబ్లీలో బిల్లు పెడితే తేలుతుందని ఆయన అన్నారు. బంగారు తల్లి పథకంపై ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉప సంఘంలో ముఖ్యమంత్రి ఉండమన్నారని, తాను ఉండనని చెప్పారు. కేవలం తన అభిప్రాయం చెప్పేందుకే హాజరవుతానని చెప్పారు. సబ్ కమిటీలో ఉన్నా లేకున్నా ఒకటే అన్నారు.

స్పీకర్‌కు టిడిపి లేఖ

ప్రతిపక్షాలను అవమానపరుస్తున్నారంటూ తెలుగుదేశం పార్టీ స్పీకర్ నాదెండ్ల మనోహర్‌కు లేఖ రాసి అంద జేసింది. ప్రజాస్వామ్య విలువలు కాపాడి సభ సజావుగా సాగేందుకు చర్యలు తీసుకోవాలని లేఖలో పేర్కొన్నారు. ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని కోరినా సకాలంలో తీసుకోలేదన్నారు. రెండేళ్లుగా వివిధ సందర్భాలలో స్పీకర్ తీరును వారు అదులో ప్రస్తావించారు.

రాజుకున్న చలో అసెంబ్లీ వేడి

మరోవైపు జూన్ 14వ తేదిన చేపట్టబోయే అసెంబ్లీ వేడి రాజుకుంది. ప్రభుత్వం అనుమతి నిరాకరించడంతో తెలంగాణవాదులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. చలో అసెంబ్లీకి అనుమతివ్వకుంటే ప్రజాస్వామ్యాన్ని కాలరాసినట్లేనని మండిపడ్డారు. తెలంగాణవాదుల ముందస్తు అరెస్టులు, బైండోవర్‌ల పైన తాము రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని తెలంగాణ న్యాయవాదులు చెప్పారు.

తాము మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయిస్తామని తెరాస ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. తెరాస, బిజెపి, సిపిఐ ఎమ్మెల్యేలు అక్రమ అరెస్టులు, బైండోవర్లపై గవర్నర్‌ను కలవాలని భావిస్తున్నారు. జనగామలో కడియం శ్రీహరిని పోలీసులు అరెస్టు చేశారు. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.

ఓయులో మళ్లీ హీట్

ఓయు జెఏసి ఇవాళ చలో అసెంబ్లీ కార్యక్రమానికి పిలుపునిచ్చింది. విద్యార్థులు పెద్ద ఎత్తున ర్యాలీగా బయలుదేరారు. దీంతో ఓయు పరిసర ప్రాంతాల్లో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఓయు గేట్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విద్యార్థులు రాళ్ల వర్షం కురిపిస్తుంటే పోలీసులు బాష్పగోళ వాయువును ప్రయోగించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+