Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

జగన్, కెసిఆర్ మీడియాలకు నో ఎంట్రీ: చంద్రబాబు

Sakshi Media
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు ఆధ్వర్యంలో నడుస్తున్న మీడియా సంస్థలను బహిష్కరిస్తూ తెలుగుదేశం పార్టీ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు బుధవారం సాయంత్రం జరిగిన తెలుగుదేశం శాసనసభా పక్షం (టిడిఎల్పీ) సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం చేశారు.

రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం తరపున నిర్వహించే మీడియా సమావేశాలకు తమ రాజకీయ ప్రత్యర్థులైన జగన్, కెసిఆర్ ఆధ్వర్యంలో నడుస్తున్న మీడియా సంస్థల ప్రతినిధులను ఆహ్వానించరాదని, తమ కార్యాలయాలలోకి వారిని అనుమతించరాదని, ఈ సంస్థల చర్చా గోష్టుల్లో నేతలు ఎవరూ పాల్గొనరాదని నిర్ణయం తీసుకున్నారు.

'సాక్షి పత్రిక, సాక్షి చానల్, టీ న్యూస్ చానల్ ఆయా పార్టీలకు అనుబంధంగా పనిచేస్తున్నాయని, పత్రికా స్వేచ్ఛను దుర్వినియోగపరుస్తున్నాయని చంద్రబాబు ఓ నిర్ణయానికి వచ్చారు. తాము ఏం చెప్పినా రాయరు...చూపించరని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని ఈ సమావేశం తర్వాత ఆ పార్టీ అధికార ప్రతినిధి ముద్దు కృష్ణమ నాయుడు చెప్పారు.

ఇదిలావుంటే, రైతాంగ సమస్యలపై గన్‌పార్క్ వద్ద తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నేతృత్వంలో ఎమ్మెల్యేలు బుధవారం ధర్నా చేపట్టారు. ప్రభుత్వ విధానాల వల్ల రాష్ట్రంలో రైతాంగం కుదేలైందని చంద్రబాబు మండిపడ్డారు. కౌలు రైతులకు రుణసహాయం అందడం లేదని విమర్శించారు. రైతాంగ సమస్యలపై ప్రభుత్వం దిగివచ్చే వరకు రాజీలేని పోరాటం చేస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+