చెడ్డపేరొస్తుంది: దాడులపై విజయమ్మకు విహెచ్ సలహా

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ భౌతిక దాడులకు తాము భయపడేది లేదన్నారు. బడుగు, బలహీన వర్గాలను ఏకం చేస్తే వచ్చే ఎన్నికలలో కాంగ్రెసు పార్టీ గెలుపు ఖాయమని చెప్పారు. పంచాయతీ రిజర్వేషన్‌లలో బిసిలకు జరిగిన అన్యాయంపై తాను ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి ఓ లేఖ రాస్తానని విహెచ్ చెప్పారు. బిసిలకు స్థానిక సంస్థల ఎన్నికలలో న్యాయం చేయాలని ఆయన కోరారు.
కాగా, పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఏమైనా అంటే భౌతికదాడులకు దిగమని పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ తమకు సూచించారని మాజీ ఎమ్మెల్యే మద్దాల రాజేష్ కార్యకర్తల సమావేశంలో చెప్పినట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దీనిపై టిడిపి కూడా స్పందించింది. తాము భయపడేది లేదన్నారు.
పిచ్చుకపై బ్రహ్మాస్త్రం: మైసూరా రెడ్డి
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ భౌతిక దాడులకు వ్యతిరేకమని ఆ పార్టీ నేత మైసూరా రెడ్డి వేరుగా చెప్పారు. స్పీకర్ పైన అవిశ్వాస తీర్మానం పెడతామని తెలుగుదేశం పార్టీ చెప్పడం పిచ్చుకపై బ్రహ్మాస్త్రమే అన్నారు. టిడిపికి దమ్ముంటే ప్రభుత్వంపై అవిశ్వ తీర్మానం పెట్టాలని సవాల్ చేశారు. ఫెడరల్ ఫ్రంట్ పైన జరుగుతున్న పరిణామాలను తాము గమనిస్తున్నామని చెప్పారు.
చలో అసెంబ్లీపై హైకోర్టు
చలో అసెంబ్లీ పిటిషన్ పైన హైకోర్టు స్పందించింది. చలో అసెంబ్లీపై పిల్ వేయలేదని రిట్ పిటిషన్ మాత్రమేనని న్యాయస్థానం పేర్కోంది. దీనిని అందరికీ ఆపాదించలేమని, రిట్ పిటిషనర్ మారుతీ సాగర్‌ను వదిలి వేయాలని హైకోర్టు పోలీసులను ఆదేశించింది. మరోవైపు చలో అసెంబ్లీకి అనుమతి లేకుండా వెళ్తే అరెస్టులు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు.












Click it and Unblock the Notifications