'వైయస్ విజయమ్మ కుటుంబాన్ని వెలేస్తున్నాం'

వారు క్రైస్తవులకు తీరని అవమానం చేస్తున్నారని, అందుకే వారిని క్రైస్తవ సమాజం నుంచి వెలివేస్తున్నట్లు చెప్పారు. రానున్న ఎన్నికల్లో వ్యక్తులను క్రైస్తవులుగా చూసి ఓట్లు వేయకుండా కేవలం క్రైస్తవ సంక్షేమాన్ని చూసే రాజకీయ పార్టీలకు మాత్రమే మద్దతివ్వాలని పిలుపునిచ్చింది.
బుధవారం రవీంద్ర భారతి ఆడిటోరియంలో రాష్ట్ర క్రైస్తవ రాజకీయ చైతన్య సదస్సు ఆధ్వర్యంలో ‘క్రైస్తవుల ఓట్లు ఎవరికి?' అన్న అంశంపై అన్ని రాజకీయపార్టీల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ నేత నేత పెద్దిరెడ్డి, కాంగ్రెస్ నేత శాంతరాజ్, తెలంగాణ రాష్ట్ర సమితి శంకర్ లూక్, తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రానున్న సార్వత్రిక ఎన్నికల్లో క్రైస్తవ సామాజిక వర్గానికి తగు ప్రాధాన్యత కల్పిస్తామన్నారు. బైబిల్ చేతపట్టుకొని ప్రజల్లోకి వచ్చి రాజకీయ లబ్ధి పొందేందుకు ఒకరు ప్రయత్నిస్తుంటే.. మరొకరు మత ప్రబోధకుడిగా చెప్పుకుంటూ క్రైస్తవ మతానికి మాయని మచ్చ తెచ్చి పెడుతున్నారని వారు జగన్‌ను, అనిల్ కుమార్‌లను ఉద్దేశించి అన్నారు.












Click it and Unblock the Notifications