వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉంటే ఉండు, పోతే పో: కొణతాలకు జగన్ సంకేతాలు

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jagan - Konathala Ramakrishna
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన దాడి వీరభద్రరావును పార్టీలో చేర్చుకోవడంపై పార్టీ విశాఖపట్నం జిల్లా నేత కొణతాల రామకృష్ణ నిరసనను వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. కొణతాల మాటలను లెక్క చేయకుండా జగన్ దాడి వీరభద్రరావును పార్టీలో చేర్చుకున్నారు. ఈ విషయాన్ని కొణతాల రామకృష్ణ స్వయంగా చెప్పారు. తాను చెప్పినా పట్టించుకోకుండా దాడి వీరభద్రరావును పార్టీలోకి ఆహ్వానించారని ఆయన అన్నారు.

దాడి వీరభద్రర రావు విషయంలో కొణతాల రామకృష్ణ జగన్‌ను చంచల్‌గుడా జైలులో గతంలో కలిశారు కూడా. ఆ తర్వాత కూడా కొణతాల రామకృష్ణ తన ధోరణి మార్చుకోలేదు. దాడి వీరభద్రరావుతో కలిసి పనిచేయడం సాధ్యం కాదని చెబుతూ వస్తున్నారు. అయితే, ఆయనను బుజ్జగించడానికి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకత్వం ఏ మాత్రం ప్రయత్నాలు సాగించడం లేదు.

సర్దుకుని పార్టీలో ఉంటే ఉండాలని, లేదంటే వెళ్లిపోవాలని జగన్ స్పష్టంగానే చెప్పినట్లు సమాచారం. దీంతో ఆయన కాంగ్రెసు పార్టీలో చేరడానికి సన్నాహాలు చేసుకుంటున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. ఆ వార్తలను కొణతాల రామకృష్ణ ఖండించారు కూడా. దాడి వీరభద్రరావును పార్టీ నుంచి దూరం చేసుకోవడానికి జగన్ సిద్ధంగా లేకపోవడంతో కొణతాల రామకృష్ణ పార్టీలో కొనసాగుతారా, లేదా అనేది చెప్పడం ప్రస్తుతం కష్టమే.

దాడి వీరభద్రరావుకు కూడా జగన్ ఏ విధమైన హామీ ఇవ్వలేదని తెలుస్తోంది. పని చేసుకుంటూ వెళ్లాలని ఆయన సూచించినట్లు తెలుస్తోంది. సర్వేలు చేయిస్తున్నామని, సర్వేల ఫలితాలను బట్టే టికెట్ల కేటాయింపు ఉంటుందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ చెప్పారు. దీన్ని బట్టి టికెట్ల పంపకం సందర్భం వచ్చేసరికి ఎవరి జాతకం ఎలా ఉంటుందో కూడా చెప్పలేని స్థితి ఉందని అంటున్నారు.

English summary
It is said that YSR Congress party president YS Jagan is ignoring Visakhapatnam party leader Konathala Ramakrishna's protest on inviting Dadi Veerabhadra Rao into the party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X