బాబుపై దూకుడేది?: శోభా, జగన్‌కు బెదిరేదిలేదు: టిడిపి

ఎన్నికలలో తమ పార్టీని దెబ్బతీసేందుకే జగన్‌ను అరెస్టు చేశారని ఆరోపించారు. ప్రజల నుంచి జగన్‌ను దూరం చేసేందుకు రెండు పార్టీలు వ్యవహరిస్తున్న తీరును గవర్నర్‌కు వివరించినట్లు చెప్పారు. జగన్ అరెస్టును టిడిపి, కాంగ్రెసు ఎంపీలు నామా నాగేశ్వర రావు, లగడపాటి రాజగోపాల్‌లు ముందే చెప్పారన్నారు. ఆధారాలు లేకుండానే జగన్‌ను అరెస్టు చేశారని మండిపడ్డారు. ఇప్పుడేమో విజయ సాయి రెడ్డిని, జగన్‌ను వేర్వేరు జైళ్లలో ఉంచాలని మాట్లాడారని, ఆయన మాట్లాడిన రెండు రోజులకే సిబిఐ పిటిషన్ దాఖలు చేసిందన్నారు.
టిడిపి నేతృత్వంలో సిబిఐ నడుస్తోందని, ఇకనైనా ఇలాంటివి పునరావృతం కాకుండా కోరినట్లు చెప్పారు. ఎపిపిఎస్సీ అక్రమాలను గవర్నర్ దృష్టికి తీసుకు వెళ్లామని, యువతకు న్యాయం చేసేలా చూస్తామని గవర్నర్ చెప్పారన్నారు. సిబిఐ విచారణ ప్రాథమిక సూత్రాలకు విరుద్ధంగా జరుగుతోందన్నారు. జగన్ కేసులో చూపిన దూకుడు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కేసులో ఎందుకు చూపడం లేదని ప్రశ్నించారు.
టిడిపి భయపడదు: రాజేంద్ర ప్రసాద్
జగన్‌ను ఏమైనా అంటే భౌతిక దాడులకు దిగాలన్న మద్దాల రాజేష్ వ్యాఖ్యలపై తెలుగుదేశం పార్టీ నేతలు పల్లె రఘునాథ్ రెడ్డి, రాజేంద్ర ప్రసాద్‌లు స్పందించారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ బెదిరింపులకు టిడిపి భయపడదని పల్లె అన్నారు. వైయస్ కుటుంబమే నేర చరిత్ర కలిగిన కుటుంబమని రాజేంద్ర ప్రసాద్ ఆరోపించారు.












Click it and Unblock the Notifications