వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏకపక్షమా: కెసిఆర్ బంద్‌ పిలుపుపై సిపిఐ, బిజెపి గుర్రు

By Pratap
|
Google Oneindia TeluguNews

KCR, Kishan Reddy and Narayana
హైదరాబాద్: తెలంగాణ బంద్‌కు పిలుపునిచ్చిన తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుపై తెలంగాణవాద పార్టీలు సిపిఐ, బిజెపి గుర్రుమన్నాయి. బంద్‌కు కెసిఆర్ ఏకపక్షంగా పిలుపునివ్వడాన్ని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె. నారాయణ తప్పు పట్టగా, కెసిఆర్ ఇచ్చిన బంద్ పిలుపుతో తమకు సంబంధం లేదని బిజెపి ప్రకటించింది. చలో అసెంబ్లీ సందర్భంగా అక్రమ అరెస్టులకు నిరసనగా కెసిఆర్ రేపు శనివారం తెలంగాణ బంద్‌కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.

తెలంగాణ జెఎసితో చర్చించిన తర్వాత తదుపరి నిర్ణయం ప్రకటిస్తామని బిజెపి రాష్ట్రాధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి చెప్పారు. బంద్‌కు కెసిఆర్ ఏకపక్షంగా బంద్‌కు పిలుపునివ్వడం సమంజసం కాదని నారాయణ అన్నారు. కాగా, కెసిఆర్‌పై తెలుగుదేశం తెలంగాణ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్ రావు తీవ్రంగా మండిపడ్డారు. ఇతర పార్టీలను సంప్రదించకుండా కెసిఆర్ ఏకపక్షంగా బంద్‌కు పిలుపునివ్వడాన్ని ఆయన వ్యతిరేకించారు.

ఫామ్ హౌస్‌లో కూర్చుని బంద్‌కు పిలుపునివ్వడం కాదని పార్లమెంటులో బిల్లు పెట్టాలని డిమాండ్ చేయాలని ఎర్రబెల్లి దయాకర్ రావు కెసిఆర్‌కు సలహా ఇచ్చారు. చలో అసెంబ్లీలో తమ పార్టీ పూర్తి స్థాయిలో పాల్గొన్నట్లు ఆయన తెలిపారు. తమ నాయకులపై రాళ్ల దాడి చేసే నీచ స్థాయికి తెరాస నాయకులు దిగజారారని ఆయన ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ శాసనసభ్యులపై కూడా దాడి చేశారని ఆయన ఆరోపించారు. చలో అసెంబ్లీని ఓడించేందుకు ప్రభుత్వం ఓవర్ యాక్షన్ చేసిందని ఆయన వ్యాఖ్యానించారు.

చలో అసెంబ్లీ సందర్భంగా అరెస్టు చేసి గోల్కోండ పోలీసు స్టేషన్‌కు తరలించిన తెరాస శాసనసభ్యులను పోలీసులు శుక్రవారం సాయంత్రం విడుదల చేశారు. ట్యాంక్‌బండ్, సచివాలయం తదితర మార్గాల్లో విధించిన ఆంక్షలను ఎత్తేశారు. బంద్ సందర్భంగా రేపు జరగాల్సిన పరీక్షలను కాకతీయ, ఉస్మానియా, ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయాలు వాయిదా వేశాయి.

English summary
CPI secretary K Narayana, BJP president G Kishan Reddy and Telugudesam leader Errabelli Dayakar Rao have opposed the Telangana bandh call given by Telangana Rastra Samithi (TRS) president K Chandrasekhar Rao unileterally.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X