రాహుల్ దూతకు చలో అసెంబ్లీ సెగ: సక్సెస్ అని విహెచ్

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణతో జరగవలసిన భేటీలు కూడా వాయిదా పడ్డాయి. ఈ భేటీలు త్వరలో ఢిల్లీలో నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. శుక్రవారం చలో అసెంబ్లీ పరిస్థితులను చూసి కాంగ్రెస్ నేతలపై మిస్త్రీ మండిపడినట్లు సమాచారం. పార్టీ పరిస్థితి బాగోలేదని అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత హూటాహుటిన మిస్త్రీ ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. ఇక్కడి పరిస్థితులను రాహుల్‌కు వివరించే అవకాశం ఉందని చెబుతున్నారు.
ఇదిలావుంటే, తెలంగాణ రాజకీయ జేఏసీ నిర్వహించిన ‘ఛలో అసెంబ్లీ' పరోక్షంగా విజయవంతమైందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు వి. హనుమంతరావు అన్నారు. బైండోవర్ కేసులతో ప్రజలను భయభ్రాంతులను చేస్తున్నారని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో విమర్శించారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై తన అంబర్ పేట నియోజకవర్గంలో అభివృద్ధికి సహకరించకపోవడంపై ఆయన మండిపడ్డారు. భూముల విషయంలో ఆయన ముఖ్యమంత్రిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ఎన్ని వేల మంది పోలీసులను మోహరించి, అడుగడుగున అడ్డంకులు సృష్టించి, తెలంగాణవాదులను నిర్బంధించినా నైతిక విజయం తెలంగాణవాదులదేనని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభ్యుడు హరీష్‌రావు అన్నారు. అసెంబ్లీవద్ద ఆయనతో పాటు మరికొందరు నేతలను అరెస్టు చేసి గోల్కొండ పోలీస్‌స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. చలో అసెంబ్లీకి అనుమతి ఇవ్వకుండా ప్రభుత్వం సాధించిందేమీ లేదన్నారు. ప్రజాస్వామ్యాన్ని ప్రభుత్వం ఖూనీ చేసిందని హరీష్‌రావు మండిపడ్డారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా నిరసనలు కొనసాగుతాయన్నారు.












Click it and Unblock the Notifications