ఫొటోలు: చలో అసెంబ్లీ ఉద్రిక్తం, రోడ్ల మీదికి నేతలు
హైదరాబాద్: తెలంగాణ జెఎసి తలపెట్టిన చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని శుక్రవారం విఫలం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం శాయశక్తులా ప్రయత్నించింది. హైదరాబాదులోని ఇందిరా పార్కు నుంచి తెలంగాణవాదులు అసెంబ్లీ వరకు ర్యాలీగా వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఈ కార్యక్రమానికి పోలీసులు అనుమతి ఇవ్వలేదు. దాంతో తెలంగాణ జెఎసి చైర్మన్ కోదండరామ్ సహా పలువురు జెఎసి నాయకులను పోలీసులు అరెస్టు చేశారు.
తెలంగాణ రాష్ట్ర సమితి, బిజెపి, సిపిఐ నేతలను కూడా పోలీసులు అరెస్టు చేశారు. తెరాస శాసనసభ్యులు భవనంపైకి ఎక్కి హల్‌చల్ చేశారు. తెలంగాణవాదులు పోలీసుల అంక్షలను ధిక్కరించి వీధుల మీదికి వచ్చే ప్రయత్నం చేశారు. వివిధ రాజకీయ పార్టీల నేతలను పోలీసులు అరెస్టు చేశారు. చలో అసెంబ్లీ కార్యక్రమం సాంకేతికంగా జరగలేదు గానీ దాని ప్రభావం పెద్దగానే కనిపించింది.
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, శానససభా స్పీకర్ నాదెండ్ల మనోహర్ శుక్రవారం ఉదయం 6 గంటలకే శానససభకు చేరుకున్నారు. ముఖ్యమంత్రి పాత అంబాసిడర్ కారులో అసెంబ్లీకి చేరుకున్నట్లు చెబుతున్నారు. అసెంబ్లీ నుంచి ఆయన తెలంగాణకు చెందిన ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ కారులో సచివాలయానికి చేరుకున్నారు. జిల్లాల నుంచి వచ్చే ఆందోళనకారులను పోలీసులు పెద్ద యెత్తున అడ్డుకున్నారు. ప్రభుత్వ చర్యకు నిరసనగా తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు రేపు శనివారం తెలంగాణ బంద్‌కు పిలుపునిచ్చారు.

అరెస్టయిన తర్వాత బిజెపి నేత నాగం జనార్దన్ రెడ్డి, తెరాస నేత వినోద్ ఫలక్‌నుమా పోలీసు స్టేషనులో ఇలా..

చలో అసెంబ్లీ సందర్భంగా ఇందిరా పార్కు వద్ద ఇలా..

చలో అసెంబ్లీ ఉద్రిక్తతలో సొమ్మసిల్లి పడిపోయిన తెరాస నేత శ్రవణ్

తెరాస నేత శ్రవణ్ ఇలా మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ..

చలో అసెంబ్లీని అడ్డుకోవడానికి పోలీసులు ఇలా..

భద్రతా బలగాల కాపలాలో హైదరాబాద్ ఇలా..

తెరాస నేత సిరికొండ మధుసూదనాచారి, తదితరులు ఇలా..

రోడ్డు మీద యువకులు ఇలా...

చలో అసెంబ్లీకి మేము సైతం అంటూ వస్తున్న మహిళలు

చలో అసెంబ్లీ సందర్భంగా పోలీసుల అదుపులో తెరాస నేతలు వినోద్ కుమార్, మందా జగన్నాథం
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications