వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నిజామే మట్టికొట్టుకుపోయాడు: సిఎంపై పాల్వాయి ఫైర్

By Pratap
|
Google Oneindia TeluguNews

 Palwai Govardhan Reddy
హైదరాబాద్: చలో అసెంబ్లీ సందర్బంగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అనుసరించిన విధానంపై కాంగ్రెసు తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యుడు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి విరుచుకుపడ్డారు. నిజాం లాంటివాడే కొట్టుకుపోయాడని ఆయన ముఖ్యమంత్రిపై వ్యాఖ్యానించారు. తెలంగాణ విషయంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తమ పార్టీ అధిష్టానాన్ని తప్పు దారి పట్టిస్తున్నారని ఆయన శనివారం మీడియా ప్రతినిధులతో అన్నారు.

చలో అసెంబ్లీ కట్టడిపై పార్టీ అధిష్టానం కిరణ్ కుమార్ రెడ్డిని ప్రశంసించిందనే మాటలో నిజం లేదని ఆయన అన్నారు. ఆంధ్రలో కాంగ్రెసు పార్టీ సర్వనాశనమైందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి పదవిలో కొనసాగడానికి కిరణ్ కుమార్ రెడ్డి తమను అణచివేయాలని చూస్తే ప్రజలు సహించబోరని ఆయన అన్నారు. ఇంతకు ముందు ఎవరూ ముఖ్యమంత్రిగా పనిచేయలేదా అని అడిగారు.

ప్రజా ఉద్యమంపై సిఆర్‌పిఎఫ్‌ను దించడం ప్రభుత్వానికి సిగ్గుచేటు అని ఆయన వ్యాఖ్యానించారు. చలో అసెంబ్లీ కార్యక్రమంలో నక్సలైట్లు చొరబడ్డారనేది నిజం కాదని ఆయన అన్నారు. తమకు కాంగ్రెసు పార్టీ కన్నా తెలంగాణ ముఖ్యమని ఆయన అన్నారు. తెలంగాణ మంత్రులు ఎన్నాళ్లు పదవులు పట్టుకుని వెల్లాడుతారని ఆయన ప్రశ్నించారు.

ప్రజలను అడ్డుకున్నారు: కిషిన్ రెడ్డి

చలో అసెంబ్లీ సందర్భంగా జరిగిన సంఘటనలపై బిజెపి రాష్ట్రాధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి మండిపడ్డారు. నిరనస తెలిపేందుకు ప్రజలను హైదరాబాద్ రానివ్వకుండా ప్రభుత్వం ఎక్కడికక్కడ దిగ్బంధం చేసిందని ఆయన విమర్శించారు. ప్రభుత్వం, పోలీసుల వైఖరికి నిరసనగా శనివారం బిజెపి నాయకులు ఆర్టీసి క్రాస్ రోడ్డు వద్ద ఆందోళన చేసి, ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.

శాంతియుతంగా నిరసన తెలిపేందుకు రోడ్లపైకి వచ్చిన తెలంగాణ వాదులను అరెస్టు చేయడం, లాఠీలు ఝళిపించడం, భాష్పవాయువు ప్రయోగించడం ప్రభుత్వ అసమర్థ చర్యలని ఆయన విమర్శించారు.

English summary
Congress Rajyasabha member from Telangana region Palwai Govardhan reddy lashed out at CM Kiran kumar Reddy for his attitude towards chalo assembly.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X