టి - బంద్‌కు మిశ్రమ స్పందన: హరీష్, నేతల అరెస్టు

Harish Rao
హైదరాబాద్: చలో అసెంబ్లీ సందర్భంగా అక్రమ అరెస్టులను నిరసిస్తూ తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) ఇచ్చిన పిలుపు మేరకు శనివారం తెలగాణ బంద్ జరిగింది. బంద్‌కు మిశ్రమ స్పందన లభించింది. సిపిఐ, బిజెపిలతో పాటు తెలంగాణ జెఎసి కూడా బంద్‌కు దూరంగా ఉన్నాయి. బంద్ సందర్భంగా సిద్ధిపేట బస్సు డిపో వద్ద ఆందోళనకు దిగిన తెరాస శాసనసభ్యుడు హరీష్ రావును పోలీసులు అరెస్టు చేశారు. ఆయనతో పాటు తెరాస నాయకులను, కార్యకర్తలను అరెస్టు చేసి పోలీసు స్టేషన్‌కు తరలించారు. మెదక్ జిల్లా సంగారెడ్డిలో కూడా పోలీసులు తెరాస నాయకులను అరెస్టు చేశారు.

కాగా, హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాల్లో బంద్ ప్రభావం పెద్దగా కనిపించడం లేదు. డిపోల ఎదుట బైఠాయించిన తెరాస నాయకులను, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. దీంతో ఆర్టీసి బస్సులు యధావిధిగా నడుస్తున్నాయి. జిల్లాల్లో ఎక్కడికక్కడ తెరాస నేతలను, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేస్తున్నారు.

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో నియోజకవర్గం ఇంచార్జీ జీవన్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేసారు. ఆయనతో పాటు పార్టీ కార్యకర్తలను, నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. ఆర్మూర్ రోడ్లు నిర్మానుష్యంగా మారాయి. దుకాణాలు, విద్యాసంస్థలు మూతపడ్డాయి. వరంగల్‌లోనూ పోలీసులు తెరాస నాయకులను అరెస్టు చేశారు. తెరాస జిల్లా అధ్యక్షుడు రవీందర్ రావుతో సహా 50 మందిని అదుపులోకి తీసుకున్నారు.

తెలంగాణ బంద్ నేపథ్యంలో మహబూబ్‌నగర్ జిల్లా శనివారం తెల్లవారు జామున ఏదుట్ల, రేమద్దెల గ్రామాల మధ్య రెండు ఆర్టీసి బస్సులకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించారు ఓ బస్సు పూర్తిగా దగ్ధం కాగా, మరో బస్సు పాక్షికంగా కాలిపోయింది. గద్వాల, అచ్చంపేటల్లో మాత్రం బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి.

నల్లగొండ జిల్లాలో కూడా డిపోల వద్ద బైఠాయించిన తెరాస నేతలను, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. బంద్‌కు సంఘీభావం తెలుపుతూ కరీంనగర్ జిల్లాలోని సింగరేణి కార్మికులు నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. హుజురాబాద్ డిపో నుంచి బస్సులు బయటకు రాకుండా తెరాస నాయకులు, కార్యకర్తలు అడ్డుకున్నారు. కరీంనగర్ జిల్లాలో విద్యాసంస్థలు బంద్‌ను పాటిస్తున్నాయి.

రంగారెడ్డి జిల్లా పరిగి డివిజన్‌లో కొందరు వ్యక్తులు బస్సులను అడ్డుకున్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో బస్సులను అడ్డుకోవడానికి ప్రయత్నించి తెరాస శానససభ్యుడు జోగు రామన్నను పోలీసులు అరెస్టు చేశారు. నిర్మల్‌లో ఆందోళనకారులు ఓ బస్సు అద్దాలను పగులగొట్టారు. ఇదే జిల్లాలోని పానగల్‌లో రెండు ఆర్టీసి బస్సులను ఆందోళనకారులు తగులబెట్టారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+