తెలంగాణ ఇస్తే దేశభద్రతకు ముప్పు: టిజి వెంకటేష్

TG Venkatesh
కర్నూలు/ హైదరాబాద్: తెలంగాణ ఇస్తే దేశభద్రతకు ముప్పు ఏర్పడుతుందనే ఉద్దేశంతోనే కాంగ్రెసు అధిష్టానం నిర్ణయం తీసుకోవడం లేదని మంత్రి టిజి వెంకటేష్ అన్నారు. శనివారం ఉదయం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో ఆందోళనకారులను అడ్డుకునేందుకు వందల కోట్లు ఖర్చు చేశారని, ఆ మొత్తాన్ని ఉద్యమకారుల నుంచే వసూలు చేయాలని మంత్రి అన్నారు.

చలో అసెంబ్లీ, బంద్ వంటి కార్యక్రమాలతో తెలంగాణ రాదని ఆయన అన్నారు. ఉద్యమాల పేరుతో ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తున్నారని ఆయన విమర్శించారు. వాటిని తెలంగాణ నాయకుల నుంచే రాబట్టాలని ఆయన అన్నారు. తెలంగాణపై కేంద్ర తీవ్రంగా ఆలోచన చేస్తోందని ఆయన చెప్పారు.

సిపిఐ ర్యాలీ నిర్వహణ

చలో అసెంబ్లీ సందర్భంగా తమ పార్టీ కార్యాలయం మగ్దూం భవన్‌లోకి పోలీసులు ప్రవేశించడాన్ని నిరసిస్తూ సిపిఐ ర్యాలీ నిర్వహించింది. హైదరాబాదులోని మగ్దూం భవన్ నుంచి బషీర్‌బాగ్‌లోని హైదరాబాద్ పోలీసు కమిషనర్ అనురాగ్ శర్మ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఆ తర్వాత ధర్నా చేశారు.

శుక్రవారం జరిగిన సంఘటనకు పోలీసు కమిషనర్ క్షమాపణ చెప్పాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె. నారాయణ డిమాండ్ చేశారు. ఇటువంటి సంఘటనలు పునరావృతమైతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరని, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే ఢిల్లీ పెద్దలతో తెలంగాణ సమస్యను పరిష్కరింపజేయాలని ఆయన అన్నారు.

ఎప్పుడైనా ప్రకటన రావచ్చు: కోమటిరెడ్డి

కాగా, చలో అసెంబ్లీని ప్రభుత్వమే విజయవంతం చేసిందని కాంగ్రెసు తెలంగాణ శాసనసభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. 2014 ఎన్నికల మానిఫెస్టోలో తెలంగాణ అంశాన్ని పెట్టిన ప్రజలు కాంగ్రెసును నమ్మరని ఆయన అన్నారు. అసెంబ్లీ సమావేశాల తర్వాత తెలంగాణపై ఎప్పుడైనా ప్రకటన రావచ్చునని ఆయన అన్నారు.

ప్యాకేజీ ఉంటే ఊహించని ఉద్యమాలు జరుగుతాయని ఆయన అన్నారు. తాము రాజీనామా చేసినా సీనియర్లు మారలేదని ఆయన విమర్శించారు. తెలంగాణ నాయకుల్లో ఐక్యత లేకపోవడం వల్లనే తెలంగాణ విషయంలో జాప్యం జరుగుతోందని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+