మంటల్లో బస్సు: 3గురు మృతి, బిటెక్ విద్యార్థి మృతి

Bus
హైదరాబాద్: చిత్తూరు జిల్లాలోని పలమనేరు సమీపంలో శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. లారీ - వోల్వో బస్సు ఢీకొనడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటల్లో చిక్కుకుని ముగ్గురు ప్రయాణికులు సజీవదహనమయ్యారు.

మరో 31 మంది తీవ్రంగా గాయపడ్డారు. విషయం తెలిసిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని సహాయకచర్యలు ముమ్మరం చేశారు. గాయపడినవారిని ఆస్పత్రులకు తరలించారు. బెంగళూర్‌ నుంచి వస్తున్న ఆర్టీసి బస్సు తిరుపతి వైపు వస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. ట్రక్కు పూర్తిగా దెబ్బ తింది. కర్ణాటక సరిహద్దుల్లో ఆ ప్రమాదం జరిగింది.

ఖమ్మంజిల్లాలోని వాజేడు మండలం ఎర్జర్లపల్లిలో శనివారం ఉదయం అకస్మాత్తుగా గోదావరి నీట్టం పెరిగింది. దీంతో చేపల వేటకు వెళ్లిన 30 మంది జాలర్లు నదిలో చిక్కుకున్నారు. సమాచారం అందిన వెంటనే అధికారులు అక్కడకు చేరుకుని జాలర్లను రక్షించారు. మొదటి 15 మందిని బయటకు తీసుకుని వచ్చారు. ఆ తర్వాత మరో 15 మందిని బయటపడేశారు.

హైదరాబాద్ నగరంలోని కూకట్‌పల్లి నిజాంక్లబ్ చౌరస్తాలో శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. సైకిల్‌ను వేగంగా వస్తున్న లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో సైకిల్‌పై ఉన్న బాలునాయక్ అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలిసిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.

ఇదిలావుంటే, విశాఖపట్నం జిల్లాలో బిటెక్ విద్యార్థి ప్రమాదవశాత్తు జలపాతంలో పడి మరణించాడు. మిత్రులతో కలిసి గాడిగొమ్మ జలపాతం వద్దకు వెళ్లిన తరుణ్ తన మిత్రుడ్ని కాపాడే ప్రయత్నం తాను మృత్యువాత పడ్డాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+