పునర్వ్యవస్థీకరణ: 2మంత్రుల రాజీనామా, ఆజాద్ ఔట్?

డిఎంకె మద్దతు ఉపసంహరించుకోవడం, అవినీతి ఆరోపణలతో పలువురు మంత్రులు రాజీనామా చేయడం, తాజాగా పార్టీ కోసమంటూ మాకెన్ రాజీనామా చేశారు. దీంతో పలు ఖాళీలు ఏర్పడ్డాయి. ఖాళీల నేపథ్యంలో సోమవారం మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ, విస్తరణ జరుగే అవకాశాలున్నాయి. మంత్రివర్గంలో ఏర్పడిన ఖాళీలను ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ భర్తీ చేసే చైయాల్సి ఉంది.
సాధారణ ఎన్నికలు ఎంతో దూరం లేనందున అజయ్ మాకెన్, సిపి జోషీలు పార్టీకి సేవ చేసేందుకు మంత్రి పదవులకు రాజీనామా చేశారు. వారి రాజీనామాలను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదించారు. వీరి బాటలోనే పార్టీ కోసం మరికొందరు రాజీనామా చేసే అవకాశాలున్నాయంటున్నారు. మరోవైపు ఢిల్లీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్‌కు కేంద్ర మంత్రివర్గంలో ఈసారి చోటు దక్కవచ్చునని చెబుతున్నారు.
ఆజాద్ ఔట్?
కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి గులాం నబీ ఆజాద్ ఆంధ్రప్రదేశా రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జిగా ఉన్నారు. ఆజాద్‌ను రాష్ట్ర వ్యవహారాల బాధ్యతల నుండి తప్పించే అవకాశాలున్నాయి. పునర్వ్యవస్థీకరణ ప్రచారం నేపథ్యంలో ఆంధ్ర ప్రదేశ్ నుండి పలువురు ఆశావహులు తమకు మంత్రి పదవి వస్తుందని భావిస్తున్నారు. కావూరి సాంబశివ రావు, రాయపాటి సాంబశివ రావులు ఎప్పటి నుండో కేబినెట్లో చోటు కోసం ఎదురు చూస్తున్నారు. రాష్ట్రం నుండి ఇద్దరికి కేబినెట్లో ఛాన్స్ ఉందంటున్నారు.












Click it and Unblock the Notifications