వివాదంలో మరో మంత్రి: మహీధర్‌కు హైకోర్టు నోటీసులు

మంత్రి మహీధర్ రెడ్డికి రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు సోమవారం నోటీసులు జారీ చేసింది. ఆయనతో పాటు మదనపల్లి శాసన సభ్యుడు షాజహాన్ భాషాకు కూడా నోటీసులు పంపించింది. రెండు వారోల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని వారిని ఆదేశించింది.
మదనపల్లి మున్సిపల్ చైర్మన్ శకుంతల దేవిపై వచ్చిన ఆరోపణలపై ఫిర్యాదు చేసినా మంత్రి, ఎమ్మెల్యే పట్టించుకోలేదని, ఆమెపై అవినీతి ఆరోపణలు వచ్చినా, నివేదిక ఇచ్చినా పట్టించుకోలేదని రమణ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎమ్మెల్యే, మంత్రి ఆస్తులపై ఎసిబి, సిబిఐలతో విచారణ జరిపించాలని అతను తన పిటిషన్‌లో కోరారు.
బయ్యారం గనులపై పిల్
విశాఖ ఉక్కుకు బయ్యారం గనుల కేటాయింపు పైన కూడా హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. విశాఖ ఉక్కుకు బయ్యారం గనుల కేటాయింపును రద్దు చేయాలని పిటిషన్ దాఖలు చేశారు.












Click it and Unblock the Notifications