రాజకీయాలపై ఆసక్తిలేదు, ఎన్నికల్లో పోటీ చేయను: అలీ

వచ్చే ఎన్నికలలో ఆయనను రాజమండ్రి బరిలో దించేందుకు ఇటు వైయస్సార్ కాంగ్రెసు అటు తెలుగుదేశం పార్టీలో పోటీ పోటీగా ప్రయత్నాలు చేస్తున్నాయనే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. రాజమండ్రి పార్లమెంటు సభ్యుడిగా తెలుగుదేశం పార్టీ తరఫున ఇప్పటికే మురళీ మోహన్ ఖరారయ్యారు. కాంగ్రెసు పార్టీ నుండి ఉండవల్లి అరుణ్ కుమార్ ఆయన ఒప్పుకుంటే జయప్రద బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయి.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుండి కూడా ఇద్దరు ముగ్గురు పోటీలో ఉన్నారు. జయప్రద రాజమండ్రి ప్రాంతానికి చెందిన వ్యక్తి. అలీ కూడా ఇదే ప్రాంతానికి చెందినవాడు. అలీని తమ పార్టీ నుండి ఎన్నికల బరిలోకి దిగితే తమకు పార్లమెంటు స్థాయిలో లాభిస్తుందని వైయస్సార్ కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు భావిస్తున్నాయని, మురళీ మోహన్ ఇప్పటికే అలీతోని మాట్లాడినట్లుగా ప్రచారం జరిగింది.
అలీని రాజమండ్రి రూరల్ ప్రాంతం నుండి బరిలోకి దింపాలని టిడిపి భావించిందని అన్నారు. వైయస్సార్ కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీల కన్ను పడటానికి పలు కారణాలు ఉన్నాయి. ఆయన కొన్ని ఏళ్లుగా తాను పుట్టిన ప్రాంతంలో పలు సామాజిక కార్యక్రమాలు చేపడుతున్నారు. దీంతో అతనికి అక్కడ మంచి పేరు ఉంది. అలీ కోసం ఆ రెండు పార్టీలు ఎప్పటి నుండో ప్రయత్నాలు చేస్తున్నాయట.












Click it and Unblock the Notifications