ద్రోహి: కెసిఆర్‌పై నాగం డౌట్, జైలు పాలిటిక్స్: నారాయణ

కెసిఆర్‌పై నాగం పరోక్ష విమర్శ
ఈ నెల 14వ తేదిన జరిగిన చలో అసెంబ్లీ కార్యక్రమంలో ఎవరు పాల్గొన్నారో.. ఎవరు పాల్గొనలేదో ప్రజలకు అందరికీ తెలుసునని భారతీయ జనతా పార్టీ నేత, నాగర్ కర్నూలు ఎమ్మెల్యే నాగం జనార్ధన్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావును ఉద్దేశించి అన్నారు.
చలో అసెంబ్లీకి రానివారు తెలంగాణ ద్రోహులని తెలంగాణ రాజకీయ ఐక్యకార్యాచరణ సమితి చైర్మన్ ఆచార్య కోదండరామ్ అన్నారని, ఆ రాని ద్రోహులు ఎవరో తేల్చాల్సిందిగా తాను ప్రశ్నించగా... కోదండరామ్ సమాధానం దాట వేశారని, కార్యక్రమానికి రానివారు ఎవరో అందరికీ తెలుసునని నాగం జనార్ధన్ రెడ్డి విమర్శలు గుప్పించారు.
ఉద్యమంలో పాల్గొంటా: శంకర రావు
మరో పదిపదిహేను రోజులలో తెలంగాణకు అనుకూలంగా ప్రకటన వస్తుందని మాజీ మంత్రి, కంటోన్మెంట్ శాసన సభ్యుడు శంకర రావు అన్నారు. తెలంగాణపై స్పష్టమైన ప్రకటన రాకుంటే తాను ఉద్యమంలో పాల్గొంటానని చెప్పారు. వచ్చే ఎన్నికలలో పోటీ చేయనని చెప్పారు. నవంబరులో ఎన్నికలు జరుగవచ్చుననే వాదన వినిపిస్తోందన్నారు.












Click it and Unblock the Notifications