అంబటికి టిక్కెట్‌ను అడ్డుకున్నారు: కన్నాపై రాయపాటి

ప్రస్తుతం వైయస్సార్ కాంగ్రెసు పార్ట అధికార ప్రతినిధి అయిన అంబటి రాంబాబుకు తాను 1987లో టిక్కెట్ ఇప్పిస్తే కన్నా లక్ష్మీ నారాయణే అడ్డుకున్నారని ధ్వజమెత్తారు. కన్నా అవినీతికి పాల్పడినందు వల్లనే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సిబిఐ) నోటీసులు పంపిందని విమర్శించారు.
కళంకత మంత్రిపై అధిష్టానం వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. డెబ్బై గజాల ఇంటిలో నివసించిన కన్నా లక్ష్మీ నారాయణ... రాజకీయాల్లోకి వచ్చాక వందల కోట్ల రూపాయలు ఎలా సంపాదించారో చెప్పాలని ఆయన తీవ్రమైన విమర్శలు గుప్పించారు.
డబ్బులు తీసుకొని ఓట్లు వేసే ప్రజలు తమనేం ప్రశ్నిస్తారని రాయపాటి ఆదివారం వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. అదే సమయంలో ఆయన కన్నాను పరోక్షంగా టార్గెట్ చేశారు. సిబిఐ అభియోగం మోపిన కళంకిత మంత్రులందరినీ పదవుల నుంచి తప్పించాలని, ఇదే విషయాన్ని తాను ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ దృష్టికి తీసుకు వెళ్లానని చెప్పారు. తాను ముప్పై ఏళ్ల క్రితమే బెంజ్ కార్లో తిరిగానని, ఇవి తనకు కొత్త కాదన్నారు. ఓ మంత్రికి సంబంధించిన ఆస్తి వివరాలను సమాచార హక్కు చట్టం ప్రకారం కోరడంలో తప్పేముందన్నారు.












Click it and Unblock the Notifications