లోకల్ పోల్స్: విజయమ్మ తెలంగాణ టూరు ఖరారు

ఈ నెల 25 తేదీ నుంచి జులై 3వ తేదీ వరకు విజయమ్మ తెలంగాణలో పర్యటిస్తారు. ఈ నెల 25వ తేీదన మెదక్, 26న నల్లగొండ, 27న మహబూబ్‌నగర్, 28 ఖమ్మం, 29న రంగారెడ్డి, 30న కరీంనగర్ సందర్శిస్తారు. ఆ తర్వాత జులై 1వ తేదీన వరంగల్, 2న ఆదిలాబాద్, 3న నిజామాబాద్ పర్యటిస్తారు. జులై 8వ తేదీన ఇడుపులపాయలో పార్టీ ప్లీనరీ సమావేశం నిర్వహించనున్నట్లు బాజిరెడ్డి గోవర్దన్ చెప్పారు.
ప్లీనరీలో అధ్యక్షుడిని ఎన్నుకోనున్నట్లు ఆయన తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో సమావేశం ఒక్క రోజు మాత్రమే ఉంటుందని అన్నారు. బోడ జనార్దన్ వ్యక్తిగత ఎజెండాతోనే బయటకు వెళ్లారని ఆయన అన్నారు. పార్టీ మారేటప్పుడు పార్టీపై బురద చల్లడం సరి కాదని ఆయన అన్నారు. విమర్శలు చేసేటప్పుడు ఆత్మపరిశీలన చేసుకోవాలని ఆయన సూచించారు.
ఉత్తరాఖండ్ వరదల్లో చిక్కుకున్న తెలుగువారిని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అన్నారు. షర్మిల పాదయాత్ర జులై చివరి వారానికి 3 వేల కిలోమీటర్లు పూర్తవుతుందని, ఈ సందర్భంగా శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో పైలాన్ ఎర్పాటు చేస్తామని చెప్పారు. చివరి బహిరంగ సభను విజయనగరంలో ఏర్పాటు చేసే అంశంపై సమావేశంలో చర్చించినట్లు ఆయన తెలిపారు. దేశవ్యాప్తంగా సిబిఐ బాధితులందరినీ ఏకం చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు.












Click it and Unblock the Notifications