రేప్, హత్య: నిరసనలతో బైక్‌పై వెళ్లిన మమతా బెనర్జీ!

మమతను గ్రామస్తులు అడ్డుకున్నారు. గ్రామస్తులు తనను అడ్డుకోవడంతో ఆగ్రహానికి గురైన మమత నిందితులు సిపిఎంకు చెందిన వారేనని ఆరోపించారు. జాతీయ ఛానళ్లలో ప్రసారమవుతున్న సమాచారం మేరకు... 27 రోజులలో తాము నిందితులను పట్టుకుంటామని, వారిని నెల రోజుల్లో శిక్షిస్తామని చెప్పారు. వారికి జీవిత ఖైదీ విధించాలని డిమాండ్ చేస్తామన్నారు.
యువతి అత్యాచారానికి గురైన ప్రాంతంలో తాము పోలీసు స్టేషన్‌ను ఏర్పాటు చేస్తామని మమత చెప్పారు. కాగా అంతకుముందు మృతురాలి కుటుంబం మమత ప్రభుత్వం నుండి ఎలాంటి సహాయం తీసుకునేందుకు అంగీకరించలేదు. అయితే రేపిస్టులకు ఉరిశిక్ష వేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు ఆందోళనకారులు మమతను అడ్డుకొని నిలదీయడంతో భద్రతా సిబ్బంది ఆమెను ద్విచక్ర వాహనంపై అక్కడి నుండి తరలించినట్లుగా తెలుస్తోంది.
ఇద్దరు మంత్రులను తొలగించిన జయ
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత తన మంత్రివర్గం నుండి ఇద్దరు మంత్రులను తొలగించారు. గత రెండేళ్లలో జయలలిత మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేపట్టడం ఇది తొమ్మిదోసారి.












Click it and Unblock the Notifications