గొడవ పడ్డారని.. ముగ్గురిని బస్సుతో తొక్కించి చంపాడు

ఈ క్రమంలో వారు బస్సు డ్రైవర్‌తో గొడవకు దిగారు. బస్సులోని ప్రయాణీకులు ఇరువురికి సర్ది చెప్పారు. అనంతరం డ్రైవర్ వారి ముగ్గురిని బస్సులో తొక్కించాడు. తర్వాత బస్సును బహేదీ పోలీసు స్టేషన్ వద్ద వదిలేసి పారిపోయాడు. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన స్థానికులు రోడ్డుపై బైఠాయించారు. పోలీసులు వారిని శాంతింపజేసి ట్రాఫిక్‌ను చక్కదిద్దారు. మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు.
బాలుడి గొంతు నులిమి చంపిన చిన్నమ్మ
గుంటూరు జిల్లాలో దారుణం జరిగింది. బొల్లాపల్లిలో పన్నెండేళ్ల బాలుడిని చిన్నమ్మ గొంతు నులిమి చంపేసింది. ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. కుటుంబ కలహాలతో ఆమె ఈ దారుణానికి ఒడిగట్టిందని సమాచారం. పోలీసులు నిందితురాలిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
ప్రకాశం జిల్లాలో ప్రమాదం
ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెద్దారవీడు మండలంలోని గొబ్బూరు సమీపంలో ఓ బస్సు లారీనీ ఢీకొంది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందినట్లుగా తెలుస్తోంది. డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని బాధితులు ఆరోపిస్తున్నారు.












Click it and Unblock the Notifications