వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కెఎల్ఆర్ లేఖపై జానా డోంట్ కేర్, మంత్రుల ముచ్చట్లు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Jana Reddy
హైదరాబాద్: తెలంగాణ నేతలు మంత్రి పదవులకు రాజీనామా చేసి తెలంగాణ గళం విప్పాలన్న కాంగ్రెసు పార్టీ సీనియర్ ఎమ్మెల్యే కెఎల్ఆర్(కె లక్ష్మారెడ్డి) లేఖపై పంచాయతీరాజ్ శాఖ మంత్రి జానా రెడ్డి మంగళవారం స్పందించారు. కెఎల్ఆర్ లేఖను పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. తనకు తెలంగాణ రాష్ట్రం ముఖ్యమని, కెఎల్ఆర్ వెనుక ఎవరున్నారో అందరికీ తెలుసునని చెప్పారు.

తెలంగాణ నేతల సమావేశం గురించి తనకు ఎలాంటి సమాచారం లేదని మంత్రి ప్రసాద్ కుమార్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం తాను ఎక్కడికైనా వెళ్తానని చెప్పారు. తెలంగాణ ప్రాంత కాంగ్రెసు నేతల సమావేశంపై తనకు సమాచారం ఉంటే వెళ్తానని చెప్పారు.

కబుర్లలో మంత్రులు... బొత్స పిలుపు

మంగళవారం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన సమయంలో పలువురు మంత్రులు లాబీల్లో కబుర్లలో మునిగిపోయారు. దీంతో ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రభుత్వ విప్‌లతో వారికి సభకు రావాలని కబురు పంపించారు.

నకిలీపై సమాచారం లేదు: కన్నా

నకిలీ విత్తనాలపై తనకు ఎలాంటి సమాచారం లేదని మంత్రి కన్నా లక్ష్మీ నారాయణ మంగళవారం చెప్పారు. నకిలీ విత్తనాలపై ఎవరైనా సమాచారం ఇస్తే వారి వివరాలను బయట పెట్టమని చెప్పారు. నకిలీ విత్తనాలు లేవని తాను చెప్పనని, వాటిని అరికడుతామన్నారు. రెండు రోజుల్లో సోయాబిన్ చిక్కుడు విత్తన సమస్యను పరిష్కరిస్తామని, మధ్య ప్రదేశ్ నుండి విత్తనాలు తెప్పిస్తున్నామన్నారు.

English summary
Minister Jana Reddy has responded on MLA KLR's(K Laxma Reddy) letter on Tuesday. Jana Reddy said I know who is behind KLR.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X