'టి' భేటీ తప్పుకాదు: కిరణ్, ఆందోళనతో తాడోపేడో

Jana Reddy and Kiran Kumar Reddy
హైదరాబాద్: తెలంగాణ ప్రాంత కాంగ్రెసు నేతల సమావేశం తప్పు కాదని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మంగళవారం అన్నారు. తెలంగాణ ప్రాంత మంత్రులు తనను కలిసి విషయం చెప్పి వెళ్లారని అన్నారు. పంచాయతీ రిజర్వేషన్‌లలో న్యాయపరంగా ఎలాంటి చిక్కులు రావన్నారు. నాలుగైదు రోజులలో రిజర్వేషన్లపై ఈసికి నివేదిక పంపిస్తామని చెప్పారు.

ప్రజా వ్యతిరేకత తట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నామన్నారు. సరైన సమయంలో మంత్రివర్గ విస్తరణ ఉంటుందన్నారు. తెలంగాణపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని తాను కేంద్ర ప్రభుత్వాన్ని, కాంగ్రెసు పార్టీ అధిష్టానాన్ని కోరుతున్నానని చెప్పారు. కేంద్రమంత్రిగా గులాం నబీ ఆజాద్ బిజీగా ఉండటం వల్లనే దిగ్విజయ్ సింగ్‌కు రాష్ట్ర పార్టీ వ్యవహారాలు అప్పగించారన్నారు.

గతం కంటే భిన్నంగా... దానం, ముఖేష్ గైర్హాజరు

తెలంగాణ ప్రాంత కాంగ్రెసు పార్టీ నేతలు ఈ రోజు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి గతంకంటే భిన్నంగా నేతలు తరలి వచ్చారు. గతంలో పలుమార్లు సమావేశాలు జరిగినా ఎవరికి వారే అన్నట్లుగా ఉండేది. ఇప్పుడు మాత్రం నేతలు చాలామంది తరలి వచ్చారు. 11 మంది మంత్రులు, 7 ఎంపీలు, 15 మంది ఎమ్మెల్యేలు, 10 మంది ఎమ్మెల్సీలు హాజరయ్యారు. మంత్రులు దానం నాగేందర్, ముఖేష్ గౌడ్, రాంరెడ్డి వెంకట రెడ్డి గైర్హాజరయ్యారు.

అధిష్టానంతో తాడోపేడో

ఈ సమావేశానికి దామోదర రాజనర్సింహ, డికె అరుణ, జానా రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, బస్వరాజు సారయ్య, ఉత్తమ్ కుమార్ రెడ్డి, గుత్తా సుఖేందర్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, షబ్బీర్ అలీ, ఆమోస్, యాదవ రెడ్డి, జగదీశ్వర్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. సాధారణ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్నందున, అధిష్టానం పెద్దలు తెలంగాణపై పలుమార్లు మాట మార్చుతున్నందువల్ల ఇక తాడోపేడో తేల్చుకోవాలని కాంగ్రెసు నేతలు భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+