ఆంధ్రలో మూడుముక్కలాట, టచ్‌లో మమత: కెసిఆర్

కెకె వయస్సు, అనుభవం ఉద్యమానికి ఉపయోగపడుతాయన్నారు. ఇక నుండి జాతీయ విషయలపై తనను కాకుండా కెకెను అడగాలన్నారు. తాము జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతామన్నారు. వచ్చే ఎన్నికల తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో అతి ఎక్కువ సీట్లు గెలుచుకొనే పార్టీగా తెరాసనే ఉంటుందన్నారు. తాము 16 పార్లమెంటు, 100 అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.
ప్రస్తుతం తమ ముందు తెలంగాణ ఏర్పాటు లక్ష్యం ఉందన్నారు. తెలంగాణ వచ్చాక రాష్ట్ర పునర్నిర్మాణంపై దృష్టి సారిస్తామని చెప్పారు. వచ్చే ఎన్నికలలో తాము ఎక్కువ లోకసభ స్థానాలు గెలుచుకొని కేంద్రంలో చక్రం తిప్పుతామన్నారు. ఐదు స్థానాలు గెలుచుకున్న పార్టీలు కూడా ఇప్పుడు చక్రం తిప్పడం మనం చూస్తున్నామని చెప్పారు. ఎపిలో ఎక్కువ లోకసభ, అసెంబ్లీ స్థానాలు గెలుచుకునే పార్టీ తెరాసనేనని, ఇది తన మాటగా చెబుతున్నానని అన్నారు.
ఆంధ్రలో మూడు ముక్కలాట
సీమాంధ్ర ప్రాంతంలో వచ్చే ఎన్నికలలో మూడు ముక్కలాటనే అన్నారు. అక్కడ పోటీ చేస్తున్న తెలుగుదేశం, కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలలో ఏ పార్టీకి పది సీట్లు వచ్చే పరిస్థితి లేదని ఆయన అభిప్రాయపడ్డారు. ఉన్న సీట్లలో అందరు పదికి తక్కువే గెల్చుకుంటారని, తెరాస మాత్రం 16 సీట్లు గెలుచుకుంటుందన్నారు.
కెసిఆర్ అంటే బహుముఖ ఉద్యమకారుడు
తాను ఉద్యమంలో పాల్గొనక పోవడంపై పలువురు ప్రశ్నలు సంధించడంపై ఆయన స్పందించారు. కెసిఆర్ అంటే బహుముఖ ఉద్యమకారుడు అన్నారు. తాను పిలుపునిస్తే వేలాదిమంది రోడ్డు మీదకు వస్తారన్నారు.
బంగాళాఖాతంలో పడేస్తాం
తెలంగాణ తప్ప ఎలాంటి ప్యాకేజీలకు ఒప్పుకునే ప్రసక్తి లేదని కెసిఆర్ అన్నారు. ప్యాకేజీ అంటే కాంగ్రెసును బంగాళాఖాతంలోకి విసిరేస్తామన్నారు. హైదరాబాదు రాజధానిగా పది జిల్లాలతో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కావాల్సిందే అన్నారు. పోలీసులతో చలో అసెంబ్లీని అడ్డుకోవాలని సీమాంధ్ర ప్రభుత్వం చూసిందని, అక్రమ నిర్భందం చేసిందని ఆరోపించారు. అయినా చలో అసెంబ్లీని విజయవంతం చేశామన్నారు. పోలీసులతో ఉద్యమాన్ని అడ్డుకోవడం ప్రజాస్వామ్యమా అని ప్రశ్నించారు.
మమత టచ్‌లో ఉన్నారు
కొందరు చిల్లర రాతలు రాస్తున్నారని, అలాంటివి సరికాదన్నారు. జాతిపిత మహాత్మా గాంధీనే దూషించే స్థాయికి కొందరు ఎదిగారని మండిపడ్డారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తమ పార్టీ సీనియర్ నేత కె కేశవ రావుతో టచ్‌లో ఉన్నారని చెప్పారు.












Click it and Unblock the Notifications