ఏకమైన 'టి' కాంగ్రెస్: తెలంగాణపై తీర్మానం, 30న సభ

ఈ నెల 30 తేదిన ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని, తద్వారా తెలంగాణ రాష్ట్రం కాంగ్రెసు ద్వారానే సాధ్యమనే విషయాన్ని గ్రామగ్రామానికి తెలియజేస్తామన్నారు. తెలంగాణ కాంగ్రెసు మాత్రమే ఇవ్వగలుగుతుందని చెప్పారు. త్వరలో తాము రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇంఛార్జ్ దిగ్విజయ్ సింగ్‌ను కలుస్తామని, దీనిపై మాట్లాడతామన్నారు. తెలంగాణ ప్రాంత నేతలమంతా రాష్ట్రం కోసం ఏకమయ్యామని చెప్పారు.
తెలంగాణ కోసం తాము అధిష్టానంపై ఒత్తిడి తెస్తామని, రాష్ట్రాన్ని సాధిస్తామని పార్లమెంటు సభ్యుడు గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. తెలంగాణ సమస్యను తక్షణమే పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకతను తాము అధిష్టానానికి తెలియజేస్తామని చెప్పారు. కాగా ఈ సమావేశానికి కొందరు నేతలు తప్ప అందరూ వచ్చారు. గతంలో జరిగిన పలు సమావేశాలకు అందరు నేతలు వచ్చిన సందర్భాలు లేవు. ఈసారి మాత్రం దాదాపు అందరూ వచ్చారు.
రెండు తీర్మానాలు
ఈ భేటీలో తెలంగాణ ప్రాంత కాంగ్రెసు నేతలు రెండు తీర్మానాలు చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని వెంటనే ప్రకటించాలని మొదటి తీర్మానం చేశారు. రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇంఛార్జిగా నియమితులైన దిగ్విజయ్ సింగ్‌ను ఆహ్వానిస్తూ.. తెలంగాణ కోసం త్వరితగతిన చర్యలు తీసుకోవాలని రెండో తీర్మానం.












Click it and Unblock the Notifications