జగన్ పార్టీ విఫలం, టిడిపి: తెలంగాణపై కోదండరామ్

కాంగ్రెసు తెలంగాణ నేతలకు అల్టిమేటం ఇచ్చారు. వచ్చే నెల 4వ తేదీలోగా కాంగ్రెసు తెలంగాణ నేతలు తేల్చుకోవాలని, లేదంటే గ్రామాల్లో అడుగు పెట్టనివ్వబోమని ఆయన అన్నారు. కాంగ్రెసు పార్టీని లక్ష్యంగా చేసుకుని కార్యాచరణ రూపొందించనున్నట్లు ఆయన తెలిపారు. తెలంగాణ ఉద్యమ కార్యాచరణ విషయంలో వెనకడుగు వేసేది లేదని చెప్పారు. చలో అసెంబ్లీ సందర్భంగా ఉద్యమకారులపై ప్రయోగించిన నిర్బంధకాండపై ప్రజాకోర్టులు నిర్వహిస్తామని ఆయన చెప్పారు.
నిబంధనల ఉల్లంఘనపై కోర్టులో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం వేస్తామని కూడా ఆయన చెప్పారు. ఈ నెల 21వ తేదీన తెలంగాణ ఆత్మగౌరవ దినం పాటిస్తామని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా గ్రామాల్లో సభలు నిర్వహిస్తామని చెప్పారు. తెలంగాణ ఏర్పాటు కోసం అవసరమైతే మరోసారి సకల జనుల సమ్మె నిర్వహిస్తామని చెప్పారు.
తెలంగాణపై కాంగ్రెసు వైఖరి మీద ఢిల్లీలో జాతీయ సదస్సు నిర్వహించనున్నట్లు తెలంగాణ ఎన్జీవోల నాయకుడు దేవీ ప్రసాద్ చెప్పారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణ వ్యతిరేకులకు ప్రజలు బుద్ది చెప్తారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications