నరసింహన్ భేటీలు: తెలంగాణపై నిర్ణయమేనన్న షిండే

కాగా, కేంద్ర మంత్రులతో భేటీ అవుతూ నరసింహన్ ఢిల్లీలో బిజీగా గడిపారు. సుశీల్ కుమార్ షిండేను ఆయన మూడు సార్లు కలిసినట్లు తెలుస్తోంది. కేంద్ర మంత్రులు పి. చిదంబరం, ఆంటోనీలతో కూడా నరసింహన్ సమావేశమయ్యారు. తెలంగాణపై ఆయన కేంద్ర మంత్రులతో విస్తృత చర్చించినట్లు చెబుతున్నారు. రాష్ట్ర పరిస్థితులపై ఆయన ఓ నివేదిక సమర్పించినట్లు ప్రచారం సాగుతోంది.
ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్‌ను కూడా నరసింహన్ కలిశారు. ప్రధానితో ఆయన దాదాపు అరగంట పాటు సమావేశమయ్యారు. నరసింహన్ సోమవారం రాత్రి ఢిల్లీకి చేరుకున్నారు. తెలంగాణపై తాను సుశీల్ కుమార్ షిండేతో చర్చించలేదని నరసింహన్ మీడియా ప్రతినిధులతో అన్నారు.
రాష్ట్రంలో శాంతిభద్రతలు బాగానే ఉన్నాయన్నారు.తెలంగాణ అంశాన్ని కేంద్రమే పరిష్కరించాలని తెలిపారు. తెలంగాణపై కేంద్రానికి తాను ఎలాంటి నివేదికను ఇవ్వలేదని వెల్లడించారు. మరో రెండు రోజులు ఢిల్లీలోనే ఉంటానని, రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ, ప్రధాని మన్మోహన్ సింగ్‌తో కూడా సమావేశమవుతానని గవర్నర్ నరసింహన్ చెప్పారు.












Click it and Unblock the Notifications