భద్రతా సమస్య: చంచల్‌గూడ జైలు ఎదుట రోడ్డు బంద్

Chanchalguda jail road closed
హైదరాబాద్: చంచల్‌గూడ జైలు ముందు రహదారిని మూసివేశారు. సిసి కెమెరాల నిఘాలో ఉన్న ఈ మార్గాన్ని భద్రతాకారణాల రీత్యా శాశ్వతంగా మూసివేయాలని అధికారులు నిర్ణయించారు. జైలు ముందున్న రహదారిలో రాకపోకలు సాగించే వాహనాలన్నీ మహిళా జైలు వెనుక గల కొత్త మార్గాన్ని ఉపయోగించుకోవాలని నగర పోలీసు కమిషనర్ అనురాగ్ శర్మ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.

కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి, మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ, ప్రముఖ పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్‌లతో పాటు పలువురు అధికారులు... ఇలా పలువురు ప్రముఖులు చంచల్‌గూడ జైలులో రిమాండ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. గాలి, జగన్ వంటి వారిని బయటకు తీసుకొచ్చినప్పుడు భారీ బందోబస్తును ఏర్పాటు చేయాల్సి వస్తోంది.

చుట్టూ ఎటువంటి భద్రతా సౌకర్యాలు లేకపోవడంతో జైలు వద్దకు వస్తున్న వారిని అడ్డుకోవడానికి ఇబ్బంది ఎదురవుతోంది. కొద్ది నెలల క్రితం జగన్‌ను కోర్టు నుంచి జైలుకు తీసుకొస్తున్నప్పుడు ఒక వ్యక్తి జైలు గేటు వరకు వచ్చి ఆయనతో కరచాలనం చేయడం కలకలం సృష్టించింది. దీంతో జైలు ముందు ఎవరెవరు తిరుగుతున్నారు? ములాఖత్‌లు తీసుకుని ఎవరెవరు లోపలకు వెళ్తున్నారు? అన్న వివరాలు తెలుసుకునేందుకు సిసి కెమెరాలు ఏర్పాటు చేశారు.

వీటితో పాటే జైలు ముందున్న రహదారిలో రాకపోకల పైనా నిఘా కొనసాగుతోంది. అయినప్పటికీ జైలు పరిసర ప్రాంతాల్లో ఇంకా భద్రతాలోపాలు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. ఈ రహదారిని పూర్తిగా మూసివేసి తమ అధీనంలోకి తీసుకోవాలని నిర్ణయించారు. రాకపోకలు సాగించే వాహనదారులకు ప్రత్యామ్నాయంగా మహిళా జైలు వెనుక కొత్త రోడ్డు నిర్మించారు. వారం రోజుల పాటు ప్రయోగాత్మకంగా పాత రహదారిని మూసివేసిన అధికారులు బుధవారం నుంచి పూర్తిస్థాయిలో అమలు చేయాలని నిర్ణయించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+